వధూ వరులిద్దరూ పెళ్లి పీఠలపై కూర్చున్నారు. పెళ్లి పెద్దలతో సహా, ఆహుతులతో పెళ్లి మండపం అంతా బిజీ బిజీ గా ఉంది. పంతులు పెండ్లి మంత్రాలు చదువుతున్నారు. పెళ్లి ఘనంగా జరుగుతుంది. సరిగ్గా వరుడు వధువుకు తాళి కట్టే సమయంలో వరుడు రేవంత్ రెడ్డి వస్తే గానీ తాళి కట్టనని మొండికేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..ఇటీవల షాద్‌నగర్‌కు చెందిన యువతితో మహేశ్‌కు వివాహం నిశ్చయమైంది. తన వివాహానికి రావాలంటూ ఆయన రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాడు. గురువారం ఘనంగా పెళ్లి జరుగుతోంది.


Image result for REVANTH REDDY

ముహూర్త సమయానికి కూడా రేవంత్‌రెడ్డి రాకపోవడంతో ఆయన వచ్చాకే వధువు మెడలో తాళి కడతానని మహేశ్ తేల్చి చెప్పడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. అయితే చేసేది ఏమీ లేక టీడీపీ కార్యకర్తలు అంతా కలిసి హుటాహుటిన హైదరాబాద్ లో ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి బయలు దేరారు. అయితే అప్పటికే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలవడానికి రేవంత్ అంతా సిద్ధం చేసుకొని బయలుదేరడానికి సిద్ధం అయ్యారు.


Image result for REVANTH REDDY

సరిగ్గా అదే సమయంలో అక్కడికి టీడీపీ కార్యకర్తలు చేసుకొని అసలు విషయం చెప్పడంతో బాబు పుట్టినరోజు కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని హుటాహుటిన పెళ్లికి వెళ్లారు. అభిమాన నేతను చూసిన ఆనందంలో మహేశ్ వధువు మెడలో తాళికట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహేశ్‌యాదవ్ తెలుగుదేశం పార్టీ అభిమాని. తెలంగాణ రేవంత్ సైన్యం (టీజీఆర్ఎస్)లో సభ్యుడు కూడా. ఆయనకు రేవంత్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. అందుకే కాబోలు ఇలా మొండికేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: