దేశం లో జరుగుతున్న ప్రతీ పరిణామం ఏదో ఒకదాన్ని సూచిస్తూనే కనిపిస్తోంది. పాకిస్తాన్ తో కోప తాపాలు, చైనా తో మాటల యుద్ధం మొదలు అవ్వడం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మీద కేసు డిల్లీ లో గవర్నర్ ఏకంగా కేజ్రీవాల్ తో వివాదం పెట్టుకోవడం అటుపక్క మహా ఘాట్ బంద్ ఏర్పాటి చెయ్యాలి అని మామ పిలుపు ఇవ్వడం, సౌత్ లో ముఖ్యమైన రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి నోట్లోంచి ముందస్తు ఎన్నికలు అనే మాట రావడం ఇలా రకరకాల అంశాలు దేశం లో త్వరలో రాబోతున్న ముందస్తు ఎన్నికల ని సూచిస్తున్నయా అంటే అవును అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


యుద్ధ మేఘాల టైపు లో ఎన్నికల మేఘాలు దేశానికి గట్టిగా తాకే క్రమం క్లియర్ గా కనిపిస్తోంది. ఎప్పుడైనా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే ఒకటే సూచిక పాకిస్తాన్ మన దేశం తో యుద్ధం చేసేస్తోంది అంటూ పెద్ద పుకారు లేపుతారు, లేదా చైనా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించేసింది అంటారు. దీపమున్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సూక్తిని భార‌తీయ జ న‌తా పార్టీ ప్ర‌భుత్వం చ‌క్క‌గా ఆచ‌ర‌ణ‌లో పెడుతోంది.


డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఊహాతీత విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆ కాషాయ ద‌ళం త‌న‌కిక ఎదురు లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. అసలైన ఎలక్షన్ కి ఏడాది మిగిలి ఉండగానే మోడీ బృందం ఎలక్షన్ పెట్టేసుకుందాం అని ఫిక్స్ అయినట్టు గట్టి సూచనలే కనిపిస్తున్నాయి. అదే వేడి లో తాము అనుకున్నది సాధించుకోవాలి అనేది బీజేపీ ఆలోచన గా ఉంది. తాజాగా చంద్రబాబు మాటలు కూడా ఓటు బ్యాంకు గురించి అవ్వడం విశేషం.


వైకాపా కి ఓటు బ్యాంకు ఎంత తగ్గింది తమకి ఎంత పెరిగింది అని చంద్రబాబు తాజాగా చెప్పడం ఏపీ లో కూడా ముందస్తు ఎన్నికలని సూచిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంచుమించుగా స‌గం మంది ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించి, బ‌లాన్ని వాపుగా మార్చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌కు పట్టు ఉంద‌ని భావిస్తోంది. అన్ని రాష్ట్రాలలో తమ పార్టీ అధికారం లో ఉన్న చోటులతో పాటు తమకి కావలసిన పార్టీ అధికారం లో ఉన్న ప్రతీ చోటా బీజేపీ ముందస్తు ఎలక్షన్ కి వెళుతోంది అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: