ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందట. అందుకే ఆయన భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారట. ఈ విషయాలను సాక్షాత్తూ ఆంధ్రా డీజీపీ నండూరి సాంబశివరావు వెల్లడించారు. మొదటి నుంచి నక్సల్స్ నుంచి ప్రాణహాని ఉన్న చంద్రబాబుకు.. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత ముప్పు మరింత పెరిగిందట.  

ap dgp sambasiva rao కోసం చిత్ర ఫలితం

ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్లో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు దారుణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి మావోయిస్టులకు మరింతగా టార్గెట్ అయ్యారట. ఒక్క ముఖ్యమంత్రి మాత్రేమే కాదు.. ఆంధ్రా సర్కారులోని ప్రముఖులందరికీ ప్రాణహాని ఉందని విశాఖ పర్యటనకు వచ్చిన పోలీస్ బాస్ నండూరి సాంబశివరావు చెప్పారు. 

chandrababu naxals కోసం చిత్ర ఫలితం
ఐతే.. ముఖ్యమంత్రి భద్రత విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదని.. తాము భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల కూడా పోలీసుల నిఘా నిత్యం ఉంటుందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఇటీవల మంత్రి లోకేష్ పై సామాజిక మాధ్యమాలలో వచ్చిన ఆరోపణల పైనా డీజీపీ స్పందించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం ప్రచారం చేస్తే ఐటీ చట్టం ప్రకారం చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. 

chandrababu security కోసం చిత్ర ఫలితం
చేతిలో సెల్ ఫోన్ ఉందని.. కనిపించిన ప్రతి విషయాన్ని షేర్లు, లైక్ లు చేయకుండా వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు. త్వరలో విశాఖలో టూరిజం పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ మీడియాకు తెలిపారు. అత్యాధునిక వసతులు, హెలీప్యాడ్ సదుపాయంతో విశాఖలో త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభంకానున్న ప్రధమ హాస్పటల్ ను సందర్శించేందుకు డిజీపీ విశాఖకు వచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: