సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేశారన్న ఆరోపణలపై గురువారం అరెస్టయిన పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ (35)ను తుళ్లూరు పోలీసులు ఈ ఉదయం విడుదల చేశారు. పెద్దల సభపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఆరోపణలపై రవికిరణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టింగ్‌ల వెనక ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించారు. గురువారం తెల్లవారుజామున సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన నివాసంలో ఉన్న రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 


అరెస్ట్‌ చేసిన అనంతనరం పోలీసులు నేరుగా మందడం ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారని రవికిరణ్‌ వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాతంలో ఆటోలో తీసుకెళ్లారని అనంతరం వేరువేరు వాహనాలు మారుస్తూ.. 3 గంటల పాటు సీఎం క్యాంప్‌ ఆఫీసు సమీపంలో అటూ ఇటూ తిప్పారని తెలిపారు. తాను పెట్టె పోస్టింగ్ ల వెను ఎవరి హస్తమైనా ఉన్నదా అని ప్రశ్నించినట్లు రవికిరణ్ తెలిపాడు. ‘పొలిటికల్ పంచ్’కు వైసీపీకి మధ్య సంబంధం గురించి పోలీసులు ప్రశ్నించారని, అయితే ఆ పేజ్ లో పెట్టే ప్రతి పోస్ట్‌కు తనదే బాధ్యత అని చెప్పినట్టు రవికిరణ్ వివరించారు.


ఈ (శనివారం) తెల్లవారుజామున పోలీసులు తనను ఇంటివద్ద వదిలిపెట్టారని చెప్పిన రవికిరణ్ ఈనెల 25, 26 తేదీల్లో మరోమారు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారని తెలిపారు. కౌన్సిల్ పట్ల అభ్యంతరకర రీతిలో పోస్టింగ్ పెట్టాడన్న అబియోగంపై ఆయనను ఎపి పోలీసులు నిన్న తెల్లవారుజామున తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: