Image result for hooters on indian vips cars

ఉత్తరప్రదేశ్ లో బా.జ.పా. ప్రభంజన విజయం తరవాత ఉన్నత స్థాయి "పోలీస్ అధికారుల సోఫాన క్రమము లో అతిపెద్ద స్థానచలనం" జరిగింది. పాలనా సోఫానం లోనే ఇది అతి పెద్ద రిషఫిల్. (బిగ్ రిషఫిల్ ఇన్ హైరార్కి) యుపి  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జావెద్ అహ్మద్ ను దాదాపు 12 మంది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో సహా రాష్ట్రం నుండి గెంటివేసినంత పనిచేసారు ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాధ్.


కొత్త డిజిపి గా సుల్కాన్ సింగ్ నియమించబడ్డారు. కొందరు అసిస్టెంట్ డిజిపి లు పరస్పర మార్పులకు గురయ్యారు అంటే స్వాపింగ్ అన్నమాట. యుపి ఎన్నికల సమయము లోనే జావెద్ అహ్మద్ సమాజ్ వాది పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని బా.జ.పా. ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.  తదనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారు ల స్థానాల్లో కొన్నిచోట్ల మార్పులు చేర్పులు కొన్నిచోట్ల స్థాన భ్రంశమూ చేసి తన మార్క్ పోలీస్ పాలనకు శ్రీకారం చుట్టారు యోగీ. 


ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్ఖాన్‌ సింగ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవరిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనే విషయంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్ట్రిక్ట్‌ ఆర్డర్స్‌ పాస్‌ చేశారని ఆయన వెల్లడించారు. అవినీతి విషయంలో అసలు సహిం చేది లేదని తేల్చిచెప్పారు. గుండాగిరిని నియంత్రించడానికి పూర్తిస్థాయిలో నిష్పక్షపాత ధోరణితో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పనిచేస్తారని అన్నారు.


యాంటీ రోమియో స్క్వాడ్ అంశంపై స్పందించిన ఆయన, అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారి విషయంలోనే యాంటీ రోమియో స్క్వాడ్ చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా సరే, గోరక్షణ, ఇతర పేర్లతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని సుల్ఖాన్‌ సింగ్‌ హెచ్చరించారు.


Image result for hooters on indian vips cars 

20 మంది ఐఏఎస్ అధికారులకు కూడా వారి వారి స్థానాల్లో మార్పులు చేర్పులు చేసి అలాగే కొంతమందిని నోయిడా, గ్రేటెర్ నోయిడా, ఘజియాబాద్ అభివృద్ది సంస్థల ఉన్నతాధికారులను వెయిట్ లిష్ట్ పెట్టారు. అంతే కాదు "వి ఐ పి లంటూ అధికార హోదాని ప్రదర్శించే  చిహ్నం" గా గుర్తించబడే  కార్ల నుండి "ఎర్ర బుగ్గలను" (రెడ్ బీకన్స్) నిన్న శుక్రవారము నుండే తొలగించారు. అంటే మోడీ కంటే తొమ్మిది రోజుల ముందేనన్న మాట. ఇది రాష్ట్రం లో "వి ఐ పి సంస్కృతి" ని తొలగించే క్రమంలో తొలి అడుగు పడిందని చెప్పవచ్చు.



Image result for hooters on indian vips cars
హెచ్చరిక చేసే హూటర్ 


అంతే కాదు వి ఐ పి లకు రక్షణ సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించెరశారు. ఈ పరిస్థితి కొనసాగిస్తే ప్రజాస్వామ్య సంస్కృతి వైపు అడుగులు పడ్డట్టే. అంతేకాదు "ముప్పు వున్న వారికి ఇచ్చే రక్షణ" పై మరోసారి పరిశీలించి సవరించేలా అదెశించారు. యోగీ దెబ్బకి చాలమంది అధికారులు మంత్రులు "రెడ్ -బ్లూ బీకాన్స్" తొలగింపులో అసలు ఆలస్యం చేయలేదు. అనేకమంది మంత్రులు క్రమశిక్షణ తో "బ్రిటీష్ వరప్రసాదితమైన, బీకన్స్ & హూటర్స్"  ను ముందుకు ముందే. అంటే  యోగీ అదేశాలు ప్రకటించ గానే తొలగించుకున్నారు. ఇప్పుడు 46 మంది మంత్రుల వాహనాలకు  హూటర్స్, బీకన్స్ లేవు. 

Image result for hooters on indian vips cars

మరింత సమాచారం తెలుసుకోండి: