ఎవరైనా అబ్బాయిలి పెళ్లి ఫిక్స్ అయ్యే సమయాల్లో అమ్మాయి ఎలా ఉండాలని కోరుకుంటాడు..? నాజుగ్గా, అందంగా, తెల్లగా, పొడవాటి జుట్టు తో అచ్చం హీరోయిన్ లాగ ఉండాలని కోరుకుంటాడు. సహజంగా అబ్బాయిలందరూ తన కళల రాకుమారి గురించి ఇలాగే కలలు కంటారు. కొందరు కలలు నెరవేరితే, మరి కొందరి కలలు నేరవేరవు. ఈ విషయాన్ని పక్కన బెడితే అందమైన మ్మాయి దొరికిన ఒక అబ్బాయి ఆ అమ్మాయి అందాన్ని మరింత అందంగా మార్చడానికే ప్రయత్నం చేస్తాడే తప్పా ఆ అందానికి ఎలాన్యి విఘాతం కలిగించడు.


Image result for men shadow

కానీ ఒక సాడిస్ట్ భర్త మాత్రం తను కోరుకునట్టు గానే అందమైన అమ్మాయి భార్యగా దొరికినా ఆ అందాన్ని మరి కొందరు చూస్తున్నారని భార్య అందంపై పగబట్టాడు. భార్యను అందరూ చూడడాన్ని సహించలేక పోయాడు. భార్య అందంగా ఉండడమే దీనికి కారణం అని భావించిన ఈ సాడిస్ట్ భర్త భార్యకు ఏకంగా గుండు కొట్టించాడు.  వివాహానికి ముందు ఆమె ఒక ప్రైవేటు సంస్థలో ఆమె ఉద్యోగిని. అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడచి.. ఒక్కటై ఏడేళ్లయినా వివేక్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు.



మొదట ఆమెను పని మాన్పించాడు. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడున్నాడు. భార్య ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని తాళం వేసుకుని వెళ్లేవాడు. బయట సమాన్లన్నింటినీ అతనే తీసుకొచ్చేవాడు. భార్య చరవాణికి ఎవరైనా ఫోన్‌ చేస్తారేమోనని అనుమానించేవాడు. పిల్లవాడిని బడిలో చేర్పించి మళ్లీ ఉద్యోగానికి వెళతానని పట్టుబట్టిన శిల్పపై నిత్యం దాడి చేస్తూ వచ్చాడు. చివరకు ఆమెను కట్టేసి గుండు చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించి ఆమె మొహంపై గాయాల్ని చేశాడు. సాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక ఇక లాభం లేదని పోలీసులకు సమాచారం అందించింది. ఈ సంఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: