బాహుబలి మేనియా క్రమంగా పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది.. సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో సినిమాకు సంబంధించిన అంచనాలు పెరుగుతున్నాయి. దీనికితోడు సినిమా ప్రమోషన్ లో అందెవేసిన చెయ్యి అయిన రాజమౌళి క్రమంగా ప్రేక్షకులను ఊరిస్తున్నారు. తాజా శనివారం విడుదలైన  బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో ఆ సినిమాపై మరింత క్రేజ్ పెంచుతోంది. 

bahubali 2 images కోసం చిత్ర ఫలితం
అదే సమయంలో బాహుబలికి ఏపీ సర్కారు కూడా అండగా నిలుస్తోంది. సాధారణంగా ఒక సినిమాను నాలుగు షోలు మించి వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అలా ఓ సినిమా నాలుగు షో ల కంటే ఆరు షోలు వేసుకుంటే దాదాపు 50 శాతం అదనపు ఆదాయం నిర్మాతకు లభిస్తుంది. ఇప్పుడు బాహుబలి 2 సినిమాను రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

bahubali 2 images కోసం చిత్ర ఫలితం
ఈ నెల 28 న విడుదల కానున్న బాహుబలి 2 సినిమాను మొదటి ప‌ది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆరు షోలు వేసుకోవచ్చన్నమాట. ఏ సినిమాకైనా తొలివారం రోజుల కలెక్షన్లే ప్రాణం.. ఆ మేరకు అనుమతి రావడం పట్ల బాహుబలి టీమ్ కూడా  ఖుషీగా ఉంది. అందినంతగా పిండుకునే అవకాశం మొదటి వారంలోనే ఉంటుంది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: