సినీనటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పోకడ ఏంటో ప్రజలకు ఓ పట్టాన అర్థం కాదు.. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.  పవన్ కల్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా ఉన్నాడా.. పార్ట్ టైమ్ గా ఉన్నాడా అన్న విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. 


ఒకవేళ పవన్ కల్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా ఉండి ఉంటే.. ఇప్పటికే పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగిపోయి ఉండాలి. పార్టీని పటిష్టం చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించాలి. ప్రజాసమస్యల పట్ల పోరాటం ప్రారంభిస్తే తప్ప జనం నుంచి నమ్మకం సంపాదించడం కష్టం.. కానీ పవన్ తీరు చూస్తే ఇప్పుడప్పుడే పార్టీని సీరియస్ గా తీసుకునేట్టు కనిపించడం లేదు. 


అందుకేనేమో జనసేనపై నాయకులు సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పవన్ కల్యాణ్ జనసేనపై హాట్ కామెంట్స్
చేశారు. పవన్ కల్యాణ్ కు పాలిటిక్స్ పట్ల సీరియస్ నెస్ లేదని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ మూడు గంటల సినిమా లాంటిదని శత్రుచర్ల వెటకారం ఆడారు. 

SHATRUCHARLA కోసం చిత్ర ఫలితం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో శత్రుచర్ల మీడియాతో మాట్లాడుతూ... పవన్ సినిమాలు మూడు గంటల పాటు చూడడానికి బాగా ఉంటాయ‌ని, అలాగే ఆయన జనసేన పార్టీ కూడా అంతేన‌ని చుర‌క‌లు అంటించారు. జనసేన పార్టీ ఎంతో కాలం నిలిచేది కాదని విమ‌ర్శించారు. పవన్ ఇకనైనా సీరియస్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇలాంటి విమర్శలు తగ్గొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: