Image result for yogi adityanath image



వేగం ఒడుపు ఆయన నైజం. చూస్తుంటే భారత ప్రధానికంటే కంటే పాలనను పరుగెత్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. ఇలా పొగడటానికి ఆయన తీసిలిన్న మరో కీలక నిర్ణయం. యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్ యాదవ్‌, మాయావతి సహా ములాయం కుటుంబ సభ్యులు డింపుల్‌ యాదవ్‌, శివపాల్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌ తదితర ప్రతిపక్ష నేతల భద్రతను తగ్గిస్తూ యోగి ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


Image result for yogi adityanath image


కామి బా.జ.పా నాయకుడు వినయ్ కటియార్‌ తో సహా కొందరికి భద్రతను పెంచారు. వినయ్ కటియార్‌ కు ప్రత్యేకించి "జెడ్‌ కేటగిరి భద్రత" కల్పించారు. శనివారం రాత్రి హోం శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యోగి ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని అభిజ్ఞవర్గాల కథనం. కారణం ప్రతిపక్షాల రాజకీయ నాయకులకు రక్షణ తగ్గిస్తూ, తన స్వ పక్షం అదే అధికార పక్ష నాయకులకు రక్షణ పెంచటమే. నిర్ణయం తీసుకున్న వెంటనే అంటే నిన్న రాత్రి నుంచే ఉత్తర్వులు అమలు కానున్నాయి.


Image result for yogi adityanath image


యూపీ లో 46 మంది వీ ఐ పీలకు భద్రత తగ్గించి, 105 మంది వి ఐ పీలకుకి పూర్తిగా భద్రతను ఉపసంహరించారు. బహు జన సమాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా, యూపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్, ఎస్పీ ఎమ్మెల్సీలు అశుమాలిక్, అతుల్ ప్రధాన్‌ తదితరులకు పూర్తిగా భద్రతను తగ్గిం చారు. సెక్యురిటీ కలిగి ఉండటం హోదాకు గుర్తుగా భావించే వారికి భద్రత సిబ్బందిని తొలగించి సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాలని ఇటీవల యోగి ఆదిత్యనాధ్ పేర్కొన్నట్లు తెలిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: