Related image




ప్రభుత్వాలు నేరస్తులపై చర్యలు తీసుకోవటాన్ని ప్రొత్సహిస్తేనే పాలన సజావుగా సాగుతుంది. అలా కాకుండా నేరస్తులు లేదా ముద్ధాయిలు ప్రతిపక్షం వారైతే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించి, బలమైన చట్టాలను ప్రయోగించి అదే తమ బందుగణ మో అస్మదీయులో,  ఐతే ఏదోలా ఇరు పక్షాలను రాజీకి తెస్తే, కేసులు పెట్టకుండా నేరస్తుల పై విచారణ జరిపి చర్యలు తీసు కోకుంటే - దాన్ని పాలన అనవచ్చా?  అంటున్నారు రాజకీయ పరిణితి సాధించిన  విజయవాడ వాసులు? దాన్ని సెటిల్మెంట్ అంటారని అంటున్నారు.



సెటిల్మెంట్  పనులు చేయటానికి  బయట గుండాలు, రౌడీలు, మాఫియా, బ్రోకర్ గాళ్ళు అమరావతి లోనే కోకొల్లలుగా ఉన్నా రని బెజవాడ వాసులు బల్ల గొట్టి చెపుతున్నారు. దానికి ప్రభుత్వం పూనుకుంటే అధికార యంత్రాంగం ఎందుకని?  అంటూ వారు ప్రభుత్వ పెద్దలకు తలవంచితే రాజ్యాంగము లోని ఇతర వ్యవస్థలు చూస్తూ మిన్నకుంటే, "ద్రౌపది వస్త్రాప హరణాన్ని వీక్షించిన కౌరవ సభకు" ఈ ప్రభుత్వానికి,  అధికార వ్యవస్థలకు,  తేడా ఏముంది అని వారు పదే పదే ప్రశ్నిస్తు న్నారు? 


Image result for private settlements in amaravati




గతములో, వనజాక్షి అనే మహిళా రెవెన్యూ అధికారిణిపై దాడిచేసిన చింతమనేని ప్రభాకర్ అనే పక్కా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యునితో ప్రభుత్వం రాజీ పరచింది. కేసు లేకుండా చేశారు. ఈ  సెటిల్మెంటులో వనజాక్షి గారు ప్రభుత్వంతో తల నొప్పి ఎందుకని, సాధారణ ఉద్యొగినిగా తల వంచుకోవటమే కాదు, ఒక అధికారిణిగా ఆమెలోని నైతిక స్థైర్యం పూర్తిగా బిక్క చచ్చిపోయి ఉంటుంది. ఒక మంచి అధికారిణి నిశ్శబ్ధమైపోవటం రాష్ట్రానికి లేదా జాతికి ఏం మేలు జరుగుతుంది?  పౌరపాలన సర్వనాశనం తప్ప దిక్కుమాలిన రాజకీయ రౌడీయిజ లక్షణం ప్రభుత్వములో కలిసినట్లేనని ప్రజాసంఘాలు వ్యక్తపరుస్తు న్నాయి. 


అయితే చంద్రబాబు చేసిన రాజీ పంచాయితీ నేడొకటి బెడిసికొట్టింది. దీనితో  ప్రభుత్వం పరువు కృష్ణ లో కలసిందంటు న్నారు విజయవాడ వాసులు. విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలోకి దౌర్జన్యంగా దూసుకు వెళ్లి మరీ అక్కడ కమిషనర్, సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యం పై టీడీపీ నేతలు దాడి చేసినా ఇప్పటి వరకు కనీసం కేసు కూడా నమోదు కాలేదు. కెమెరాల సాక్షిగా కమిషనర్‌పై బోండా ఉమా, కేశినేని నాని, బుద్దా వెంకన్న దౌర్జన్యం చేసినా ఐపీఎస్‌ ల సంఘం కూడా గట్టిగా ప్రతిఘటించలేకపోయింది. నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలాగే రాజీ పంచాయతీ చేసి పంపించారు.



Related image




అలాంటి పరిస్థితి లో అధికార యంత్రాంగం తన భాధ్యత నిర్వహించక పోవటానికి ప్రభుత్వం లోని పెద్దలు సెటిల్మెంట్నిర్వ హించటమే ప్రధాన కారణం. ఇందులో కేసినేని నానిది అధికార కులమని, బుద్ధా వెంకన్న, బోండా ఉమలను అస్మదీయులైన టిడిపి వాళ్ళు కావటమే కారణమని రాజధాని వాసులు చింతిస్తున్నారు. ప్రభుత్వమే సెటిల్మెంట్లకు ప్రోత్సాహమివ్వటం నూతన రాజధానిలో ఒక దుష్ఠ సాంప్రదాయానికి స్వతహాగా ప్రభుత్వమే పూనుకోవటం అందరిని నిశ్చేష్టులను చేస్తుంది.



ఒక ఐపీఎస్‌ అధికారి పై దాడి చేస్తే కనీసం కేసు కూడా  నమోదు చేయకుండా కేవలం సారీ చెప్పించి సరి పెట్టారట చంద్ర బాబు. ముఖ్యమంత్రే నేరుగా పంచాయితీ చేయడంతో ఐపీఎస్ అధికారి  బాలసుబ్రమణ్యం కూడా ఏమీ చేయలేకపోయారు. కనీసం కేసు పెట్ట లేక పోయారు, అదీ ఐపిఎస్ అధికారి అయిఉండి కూడా. ఇక అక్కడ పౌరపాలన ఎంతసజావుగా సాగుతుందో ఆ దైవానికే తెలుసని తెలిసినా భయంతో విజయవాడ వాసులు నోరు తెరవటములేదట.  



Image result for ips officer n. subramanyam - commissioner transport ap




అయితే  హైకోర్టు మాత్రం రౌడీలని ప్రజలంటున్న ఈ  బ్యాచ్‌ కు షాక్ ఇచ్చింది. సీనియర్ ఐpiఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం పై దాడి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యం పై దాడికి సంబంధించి ప్రముఖ పత్రిక సాక్షి లో వచ్చిన కథనాలను చూసి చలించిన ఒక  న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు, టిడీపీనేతల దౌర్జ న్య కాండను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ దృష్టికి తీసుకెళ్లారు.


వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం గా (పిల్)  స్వీకరించాలని కోరారు.  దాడి అంశాన్ని పిల్‌ గా స్వీకరించవచ్చా?  లేదా? అన్న దానిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు జడ్జీల అభిప్రాయలను కోరారు. వారిలో ముగ్గురు పిల్‌ ను విచారణ కు స్వీకరించాలని సిఫార్సు చేశారు. పిల్‌ ను సమర్ధించిన ఒక న్యాయమూర్తి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Image result for ips officer n. subramanyam - commissioner transport ap



"సమాజంలో తమ పాత్ర ఏంటన్న దానిపై ప్రభుత్వములోని పెద్దలకు గాని, అధికారులకు గాని అవగాహన ఉన్నట్టు అనిపిం చడం లేదని, రాజకీయ అవినీతి, అపరిమిత అధికారం వారిని ఈ దౌర్జన్యాలకు  ప్రోత్సహించినట్లు  కనిపిస్తున్నాయని వ్యాఖ్యా నించారట. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని విచారణ కు స్వీకరించడం ద్వారా వక్ర మార్గం లో పయనించే రాజకీయ నాయకు లకు గట్టి సందేశం పంపినట్టు అవుతుందని అభిప్రాయ పడ్డారట . దీంతో ఈ వ్యవహారాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు" అని తెలుస్తుంది. 



ఈ పిల్‌ పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ కేసు లో కేశినేని నాని, బొండా ఉమ తో పాటు సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. "చంద్రబాబు సెటిల్ మెంట్"  తో  ఐపీఎస్‌ అధికారి  బాలసుబ్రమణ్యం పై దాడి వ్యవహారం ముగిసిందని భావించిన టీడీపీ నేతలకు ప్రస్తుత పరిణామం మింగుడు పడడం లేదు. 



Related image

ప్రతిష్ఠాత్మకంగా శాంతి భద్రతలను కాపాడుతున్న నండూరి సాంబశివరావు గారు అంధ్రప్రదేశ్ డిజిపి   




అదే ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షానికి  చెందిన ఎమెల్యే గారి దివాకర్ ట్రావల్స్ బస్ ప్రమాదములో 20 మంది ప్రజలు మరణించగా ప్రశ్నించినందుకు పోలీస్ కేసు పెట్టిన ఐఏఎస్ అధికారి ఇప్పుడేమి అంటారని, అలాగే ఆనాడు ప్రభుత్వాన్ని సమర్ధించిన "ఐఏఏస్ అధికారుల సంఘం" నేడేమి చేస్తుందని? ప్రతిపక్షం ప్రశ్ని స్తుంది. "ఐఏఏస్ అధికారుల సంఘం" అలా ప్రవర్తించబట్టే వెన్నెముఖ లేకుండబట్టే ఎన్.సుబ్రమణ్యం అనబడే ఒక సమర్ధుడైన అధికారి సిగ్గుతో తలవంచు కోవలసి వచ్చిందని ఒక రాజ్యాంగ మూలస్థంభమైన అధికార వ్యవస్థ మరణసదృశమైన స్థితిలో కొట్టుమిట్టాడుతుందని విజ్ఞులైన అమరావతి వాసులు వ్యధ చెందటం న్యాయ వ్యవస్థలో ఈ ఆలోచనకు అమ్మ కనకదుర్గాదేవే చిత్త చైతన్యం కలిగించిందని ఆంధ్రులు భావిస్తున్నారట. 




బెజవాడను కాపాడటానికి అమ్మలగన్న అమ్మ ఉంది. అవినీతి మయ పునాదులపై రూపుదిద్దుకుంటున్న నూతన రాజధాని అమరావతిని ఆ అమరేంద్రుడైనా కాపాడలేడని తెలుగు ప్రజలు వ్యధ చెందుతున్నారు.  ఈ (అ)రాజకీయ చక్రబంధం నుండి ఇక న్యాయవ్యవస్థైనా కాపాడుతుందని ప్రజల భావన.   

మరింత సమాచారం తెలుసుకోండి: