ఔను.. నిజం.. ఈ వార్త కనుక నిజంగా నిజమే అయితే కేసీఆర్, చంద్రబాబు నిజంగా పండుగ చేసుకుంటారు. కేసీఆర్ కంటే ఎక్కువగా చంద్రబాబు ఎగిరిగంతేస్తారు.. ఇంతకూ ఆ వార్త ఏంటనుకుంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా కేంద్రం ముందడుగు వేసిందట.

babu-kcr-2.jpgని ప్రదర్శిస్తోంది
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు అవసరమైన.. క్యాబినెట్‌ నోటు తయారీకి సంబంధించిన ఫైలుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సంతకం చేసేశారట. ఈ విషయాన్ని ఓ తెలంగాణ ఎంపీ కన్ఫామ్‌ చేశారంటూ ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖలోని శాసన, న్యాయ విభాగ కార్యదర్శులు ఈ నోట్ తయారీలో భాగస్వాములు అవుతారట.

babu-kcr-3.jpgని ప్రదర్శిస్తోంది
అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుతారన్న నమ్మకంతో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ఇద్దరూ విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. పార్టీలోకి వచ్చినవారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయి కాబట్టి మీకు టిక్కెట్ గ్యారంటీ అంటూ ఊరిస్తూ వచ్చారు. ఐతే.. ఈ సీట్ల పెంపు అంత సులభమైన వ్యవహారం కాదు కాబట్టి వచ్చే ఎన్నికల్లోపు అసాధ్యమే అన్న వాదనలు వినిపించాయి.

babu-kcr-4.jpgని ప్రదర్శిస్తోంది
కానీ ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే... సాధ్యమైనంత త్వరగానే ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందట. మూడు శాఖల కార్యదర్శులు నోట్ తయారు చేసిన తర్వాత కేంద్ర కేబినెట్ తుది నిర్ణయం తీసకుంటుంది. రాజ్యాంగ సవరణకు కేంద్రం మొగ్గు చూపితే వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: