అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయిన బెజవాడ తెలుగుదేశం నేతలపై ఆ పార్టీ అధినేత ఎలాంటి చర్య తీసుకోలేదు.. మీడియా సాక్షిగా బెజవాడ నడిబొడ్డున ఓ బ్యూరోక్రాట్‌ ను నిలబెట్టి మరీ ప్రజాప్రతినిధులు కొట్టినంత పని చేస్తే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలూ ఉండవు. ఇదేం దారుణం అని అడిగితే.. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కదా.. కౌన్సెలింగ్ ఇచ్చారు కదా.. సారీ చెప్పించారు కదా.. అని తెలుగుదేశం శ్రేణులు చెప్పుకొస్తాయి.

nani-1.jpgని ప్రదర్శిస్తోంది
ఓ ఐపీఎస్ అధికారిని నిలబెట్టి.. అతని గన్ మెన్ పై చేయి చేసుకుంటే.. అన్నీ చూస్తూ పళ్ల బిగువున సదరు ఆఫీసర్ నేతల దౌర్జన్యాన్ని భరించిన దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. కానీ యథాప్రకారం ఆ విషయం మరుగునపడిపోయింది. ఈ వ్యవహారాన్ని కూడా సీఎం సెటిల్ మెంట్ చేశారని వైసీపీ నేతలు అప్పట్లోనే ఆరోపణలు గుప్పించారు. ఆ విషయం అంతటితో ముగిసిపోయింది.

nani-2.jpegని ప్రదర్శిస్తోంది
తాజాగా.. బెజవాడ టీడీపీ నేతలకు అనుకోకుండా ఓ న్యాయమూర్తి నుంచి షాక్ తగిలింది. ఏపీ రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం, సిబ్బందితో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా , ఎమ్మెల్సీ బుద్దా దుర్భాషలాడుతూ, దురుసుగా ప్రవర్తించారంటూ గత నెల 27న మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు లెటర్ రాశారు. ఈ లేఖను పరిశీలించి పిల్ గా స్వీకరించారని కోరారు.

nani-4.jpgని ప్రదర్శిస్తోంది

దాంతో ఆ లెటర్ ను జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ పిల్‌ కమిటీ ముందు ఉంచారు. కమిటీ దీన్ని పిల్ గా స్వీకరించాలని కోరటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని విస్తృత దృష్టితో చూడాలని ఓ జస్టిస్ అభిప్రాయపడ్డారట. రాజకీయ కార్యనిర్వాహకులకు సమాజంలో వారిపాత్రపై అవగాహన లేనట్లు కనిపిస్తోందని సీరియస్ కామెంట్ చేశారట. తప్పులకు పాల్పడుతున్న రాజకీయ నాయకులకు బలమైన సందేశం పంపడం కోసం ఈ విషయాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. సో.. బెజవాడ టీడీపీ నేతలకు త్వరలోనే షాక్ తప్పదన్నమాట..



మరింత సమాచారం తెలుసుకోండి: