ఏక్షణమైనా ఎన్నికలకు సిద్దంగా ఉండండి అంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.. అటు తెలంగాణలో కేసీఆర్ కూడా సంక్షేమ పథకాల జోరు పెంచేశాడు.. అటు మోడీ ఏకకాలంలో ఎన్నికలే మంచివంటూ ముందస్తు సంకేతాలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2018లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



అందుకేనేమో సినిమా తారలు కూడా రాజకీయాలపై దృష్టి పెట్టేస్తున్నారు. ఇటీవలే హీరో సుమన్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించేశాడు. పార్టీ పేరు చెప్పకపోయినా రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఖాయమని తేల్చి చెప్పేశాడు. అలాగే ఇటీవల తెలుగులోని సీనియర్ హీరోయిన్ రాశి కూడా రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. 


HEROIN RAASI కోసం చిత్ర ఫలితం
ఆమె ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలిసిందట. ఈ విషయం స్వయంగా ఆమే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేసింది.  అయితే తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కిందనుకోండి. అది వేరే విషయం. కానీ ఓ హీరోయిన్ జగన్ ను ఎందుకు కలసి ఉంటుందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకే రాజకీయాల ప్రసక్తి లేదని రాశి చెప్పినా నమ్మబుద్దికావడం లేదు. 

HEROIN RAASI IN LANKA కోసం చిత్ర ఫలితం

ఏదేమైనా జగన్ పార్టీలో సినిమా నటుల హడావిడి తక్కువే. రోజా, విజయచందర్ వంటి ఒకరిద్దరు తప్పతే సినిమా వాళ్లు పెద్దగా వైసీపీ వైపు లేరు. నటదంపతులు రాజశేఖర్, జీవితలు ఆ మధ్య జగన్ వైపు వెళ్లినా.. తర్వాత దూరమైపోయారు. మరి ఇప్పుడు రాశి కూడా వారిబాటలోనే రాజకీయాల్లోకి వెళ్తుందా.. అన్నట్టు ఆమె కొత్త సినిమా లంక కూడా ఇటీవలే విడుదలైంది. మరి సినిమాలు, రాజకీయాల్లో ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: