సినిమా అనేది మనకు వినోదం...మనసుకు ఆహ్లాదం కలిగించే ఓ సాధనం. సమాజానికి ఆహ్లాదం అందించే ఓ పరిశ్రమ. మనల్ని కాసేపు నవ్వించి...గిలిగింతలు పెట్టి...ఊహాలోకాల్లోకి తీసుకుపోయి విహరింప చేసే ఓ కాల్పనిక పరిశ్రమ. అది మనకు జీవితం కాదు. కూడు పెట్టదు. బతుకు తెరువు కల్పించదు.నిద్ర లేచిన దగ్గరి నుంచి మన బతుకులు మనం బతకాల్సిందే. గాడిద పని గాడిద...కుక్క పని కుక్క చేయాల్సిందే.

baahubali 2 mania కోసం చిత్ర ఫలితం

మనసుకు కాస్త విరామం కావాలని అనిపించినప్పుడు....మన కష్టార్జితం నాల్రూపాయలు పారేసి ...దగ్గర్లో ఉన్న ఓ సినిమా థియేటర్ లో కూర్చుని వస్తాం. థియేటర్ లో నుంచి బయటకు రాగానే...మన జీవన పోరాటం లో మనం పడిపోతాం.అంటే.... సమాజానికి కూసింత సేపు వినోదం కలిగించే సినిమా పరిశ్రమ మనం ఇచ్చే నాల్రూపాయలు మీద ఆధారపడి జీవనం సాగిస్తోంది. దాని లెవెల్ అంతే. మనల్ని వినోదపరచడానికి...ఆనందపరచడానికి...ఆహ్లాదపరచడానికి...ఆశ్చర్యపరచడానికి ఆ పరిశ్రమ లో పని చేసేవాళ్ళు రకరకాల ట్రిక్కులు...జి మ్మిక్కులు...మేజిక్ లు...సమస్త టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. వాటిని మనం నాల్రూపాయలు ఖర్చుపెట్టి  థియేటర్ కెళ్ళి చూడడం... ఆనందించడం లో తపు లేదు. 

baahubali 2 mania కోసం చిత్ర ఫలితం

కానీ ఈ ప్రక్రియ ఓ వేలం వెర్రి లా తయారై, జనాలను వెర్రి వాళ్ళను చేసి, డబ్బు చేసుకునే ప్రయత్నాలను చూస్తుంటే ....సినిమా మాయాజాలాన్ని మించిన ఆశ్చర్యం వేస్తుంది.
ఈ మధ్య ఏ తెలుగు..ఇంగ్లీష్ ఛానెల్ చూస్తున్నా...'కట్టప్ప బాహుబలి ని చంపాడా...లేదా? చంపక పోతే....మరి ఎవరు చంపారు? చంపితే. ...ఎందుకు చంపాడు? అంటూ అదో జాతీయ సమస్య అన్నంత స్థాయిలో హడావిడి కనబడుతోంది. కట్టప్ప బాహుబలి ని చంపితే ఏమిటి...చంపక పోతే ఏమిటి?

why kattappa kill bahubali కోసం చిత్ర ఫలితం

సమాజానికి ఈ చర్చ ఏ రకమైన ఉపయోగం? కూడు పెడుతుందా...గుడ్డ పెడుతుందా?ఇటువంటి చిల్లర విషయాలు చర్చించేంత తీరుబడిగా...కడుపు నిండి జనం ఉన్నారా? మన రోజువారీ జీవనానికి ....కట్టప్ప బాహుబలిని చంపడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పనికి మాలిన చర్చ ఎవరికి ఉపయోగం? ఆ సినిమా నిర్మాతలు, దర్శకుడు, ఆ సినిమా నిర్మాణం తో సంబంధం ఉన్న వారికి తప్ప... ఇంకెవరికైన దమ్మిడీ ఉపయోగం ఉందా? సినిమా వ్యామోహం ఒక పరిధి దాటితే..దానికి డ్రగ్స్ కూ పెద్ద తేడా ఉండదు. కట్టప్ప బాహుబలి ని చంపాడా...లేదా అని చర్చిస్తూ మన విలువైన సమయాన్ని వృధా చేసుకునే కంటే....

why kattappa kill bahubali కోసం చిత్ర ఫలితం

1. చంద్రబాబు ప్రభుత్వం మన సమాజానికి ఏమైనా ఉపయోగ పడుతోందా ...లేదా?
2.ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు ను గెలిపించడం వల్ల సమాజానికి లాభమా...నష్టమా?
3. జగన్ పార్టీ ని గెలిపించాలా...వద్దా?
4.ఏమి చేస్తే...సమాజానికి ఏమిటి?
5. మన జిల్లా కలెక్టర్ గారు ఎలా పని చేస్తున్నారు? ఎస్ పి గారి తీరు ఎలా ఉంది?
6. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమ్యా..మ్యా...ఏ రేంజ్ లో ఉంది?
ఇలాంటి సవాలక్ష సామాజిక అంశాల పై చర్చిస్తే...బాగుంటుంది.
అంతే తప్ప...రాజమౌళి గెడ్డం పెంచింది ఎందుకు....గెడ్డం గీయించింది ఎందుకు అంటూ హైరానా పడిపోవడం దేనికి?
 భోగాది వెంకట రాయుడు
 జర్నలిస్ట్

( సోషల్ మీడియా పోస్ట్.. ఇండియా హెరాల్డ్ పాఠకుల కోసం..)



మరింత సమాచారం తెలుసుకోండి: