ఆయనో కామెడీ రెడ్డిగారు.. పక్కా మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న ఆయన వేషాలు చూసి ఎలాంటి మీడియా అయినా కవరేజీ ఇవ్వాల్సిందే. ఆడ వేషం వేసినా.. రిక్షా తొక్కినా.. బీడీలు తాగినా.. కూలీ అవతారం ఎత్తినా ఆయన స్టయిలే వేరు. ఈ పాటికి మీకు ఆయన గుర్తొచ్చే ఉంటారు. మీ ఊహ కరెక్టే ఆయనే నెల్లూరు పొలిటీషియన్ ఆనం వివేకానందరెడ్డి.

anam vivekananda reddy కోసం చిత్ర ఫలితం

కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం బ్రదర్శ్.. కాంగ్రెస్ చావు దెబ్బ తర్వాత ఆ పార్టీని విడిచిపెట్టారు. అధికారంలో ఉండటంతో టీడీపీ పంచనే చేరారు. పార్టీలో చేరే సమయంలో ఆనం బ్రదర్స్ కు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారట. ప్రత్యేకించి ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపారట. కానీ ఆ హామీ ఇప్పటివరకూ అలాగే ఉంది.  

సంబంధిత చిత్రం

దీనికి తోడు పార్టీలోనూ ఆనం వివేకానందరెడ్డికి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదట. దీనికితోడు జిల్లా టీడీపీ నేతల దారుణాలకు హద్దు, అదుపు లేదని.. తాను పార్టీలో ఉంటేనే నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల గెలుపు సాధ్యమని ఆనం నమ్ముతున్నారు. కానీ తనను అసలేమాత్రం పట్టించుకోకపోవడం ఆయన్నుబాధిస్తోందట. అసలు పార్టీ మారే సమయంలోనే వివేకా అంత సుముఖంగా లేరట. 

anam vivekananda reddy కోసం చిత్ర ఫలితం

ఆనం రామనారాయణరెడ్డి ఒత్తిడితో పార్టీ మారిన వివేకా తాజా పరిణామాలతో కలత చెందారట. అందుకే ఇటీవల సోమిరెడ్డి ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినా ఆనం సోదరులు హాజరు కాలేదు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఆనం సోదరులతో వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చారని.. నిర్దిష్టమైన హామీలు ఇస్తే వైసీపీలోకి వెళ్లేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదని వివేకా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: