తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.  ఆమె మరణం తర్వాత తమిళనాడులో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుతుగున్నాయి.  ఇప్పుడు అమ్మ ఆస్తులపై కొంత మంది కన్నేసినట్లు తెలుస్తుంది.  జయలలితకు సంబంధించిన కోట్ల ఆస్తులపై ఇప్పటికే వారసుల గొడవ నడుస్తుండగా.. జయలలితకు చెందిన వేలాది కోట్ల విలువైన ఆస్తులను చేజిక్కించుకోవడానికి కొందరు కుట్రలు పన్నుతున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా ఊటీలోని కొడనాడ్ ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా బహదూర్ అనే మరో వాచ్ మన్ ఎదిరించబోగా అతడిపై దాడి చేసి వారు పరారయ్యారు.  ఎస్టేట్ లోని కొన్ని కీలక పత్రాలు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు పోలీసులు. వారం క్రితం చెన్నై శివారులోని జయలలిత గెస్ట్ హౌస్‌లో కూడా అగ్నిప్రమాదం సంభవించి కొన్ని కీలక పత్రాలు ధ్వంసమయ్యాయి.

ఈ రెండు ఘటనలను బట్టి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న దాడులేమోనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయిదు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కొడనాడ్ ఎస్టేట్ సుమారు 900 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఎక్కువగా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న భారీ బంగ్లాలో జయ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: