బాబు కు, మంత్రులకు జగన్ ఫోబియా పట్టుకుందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల కాలంలో బాబు ఎలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినా కేవలం జగన్ ను టార్గెట్ చేసుకొనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని, మంత్రులందరు కూడా ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినా ఇదే సిస్టం ఫాలో అవుతున్నారట. ఇటీవల ముఖ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో జగన్ పూర్తిగా అసహనాన్ని నింపుకొని రావడం, వచ్చీ రాగానే జరగాల్సిన కార్యక్రమాన్ని పక్కనబెట్టి కేవలం జగన్ లక్ష్యంగా విమర్శలకు దిగడం అధికారులకే విడ్డురంగా అనిపించింది.


Image result for babu jagan

అంతకు రెండు  రోజుల ముందు విశాఖ వచ్చిన బాబు అక్కడా ఇదే ధోరణి కనబరచారు. సాక్షాత్తు అప్పన్న ఆలయం వద్ద విలేకరులతో మాట్డాడుతూ నాపైన ఢిల్లీలో ఫిర్యాదు చేసే స్ధాయి జగన్‌దా అంటూ నిప్పులు చెరిగారు. అనకాపల్లి సభలో అయితే జగన్‌ రాజకీయ నాయకుడే కాడని తేల్చేశారు.  విశాఖ రైల్వే జోన్‌పైన కానీ, మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు, జాతీయ విద్యా సంస్ధల గురించి కూడా ప్రస్తావిస్తారనుకున్న ముఖ్యమంత్రి ప్రత్యర్ధి పార్టీలపై పూనకం వచ్చినట్లుగా విమర్శలు చేయడంతో సభకు వచ్చిన జనం అవాక్కయ్యారు.


Image result for babu jagan

మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబు తన దృష్టిని పూర్తిగా మళ్లీ అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంగా, ఎలాగైనా జగన్ పార్టీ కి  ఇదివరకంటే తక్కువ సీట్లను దక్కేలా చేయాలని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: