తెలుగులో న్యూస్ ఛానళ్లు ఎన్ని సడన్ గా అడిగితే చెప్పడం కాస్త కష్టమే.. ఒకటా రెండా.. చిన్నా చితకా అన్ని న్యూస్ ఛానళ్లు కలుపుకుంటే దాదాపు పాతిక వరకూ ఉంటాయి. బహుశా భారత దేశంలో మరే ఇతర భాషలోనూ ఇన్ని న్యూస్ చానళ్లు లేకపోవచ్చు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న తమిళనాట కూడా ఇన్ని న్యూస్ ఛానళ్లు లేవు. 


అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో మొదలై.. ఆ ప్రభంజనాన్ని పక్క రాష్ట్రాల్లోనూ కొనసాగించేందుకు ప్రయత్నంచడం మరో విశేషం. ఇప్పటికే టీవీ9 గ్రూప్ దేశమంతటా నెట్ వర్క్ విస్తరించుకుంది. పలు భారతీయ భాషల్లో న్యూస్ ఛానళ్లు ఆరంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు మరో ప్రముఖ తెలుగు చానల్ కూడా అదే బాటలో పయనిస్తోంది.

TV5 BR NAIDU కోసం చిత్ర ఫలితం
అదే టీవీ5.. తెలుగులో విజయవంతంగా నడుస్తున్న ఛానళ్లలో టీవీ5 ఒకటి. ఇప్పుడీ ఛానల్ టీవీ 5 కన్నడ ప్రారంభించబోతోంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకే చెందిన బీఆర్ నాయుడు ఈ ఛానల్ యజమాని. ఆయనకు ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. తెలుగులో సక్సస్ అయిన టీవీ5 ఇప్పుడు కన్నడ ఛానల్ కు శ్రీకారం చుడుతోంది. ఇందుకు సంబంధించిన నియామకాల ప్రకటన వెలువడింది. 

TV5 BR NAIDU కోసం చిత్ర ఫలితం
ఐతే.. ఇప్పటికే కన్నడలో న్యూస్ ఛానళ్ల పోటీ బాగానే ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ చానల్ అత్యాధునికంగా నిర్మించిన సొంత భవనంలోకి మారింది. ఈ టీవీ 5 కన్నడను కూడా ఈ భవనం నుంచే ప్రసారాలు ఇస్తారట. మరి కన్నడలో ఇప్పటికే టీవీ9 కన్నడ సక్సస్ అయ్యింది. ఇప్పుడు టీవీ 5 కన్నడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ టు టీవీ 5 కన్నడ టీమ్. 



మరింత సమాచారం తెలుసుకోండి: