అధికార పార్టీ అన్నాక వలసలు సహజం. ప్రతిపక్షం లో ఉన్న వారంతా పదవుల కోసం అధికార పక్షంలో చేరడం నేటి కొత్త తరం రాజకీయాల్లో షరామాములే. అయితే అధికారా పార్టీలోకి వలస వెళ్లిన వారందరికీ మంత్రిపదవులు దక్కుతాయా..? అంటే లేదనే సమాధానమే విస్పష్టం. ప్రస్తుతం అధికార టీడీపీ పక్షంలో కూడా అసంతృప్తి సెగ మొదలయింది. ఇటీవల మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన జరిగిన విషయం అందరికీ తెలిసిందే.


Image result for ysrcp

అయితే అయితే ఇందులో పదవులు ఆశించిన వారికి ఆషా భంగమే మిగిలింది. అధికార పార్టీలో ఉన్నా, పదవులను ఆశిస్తున్నా పదవులు దక్కకపోవడం పై వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, ప్రతిపక్ష వైకాపా లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తునట్టు సమాచారం. నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి, వైకాపాలో చేరనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.



తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకు వైకాపాకు చెందిన కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. నెల్లూరులో మరింత బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైకాపా ఎత్తుగడల్లో భాగంగా, రెండు రోజుల క్రితం భూమన స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకాతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: