తెలుగుసినిమాలో ఆయన ఓ అందమైన హీరో, ఆయన ఉన్నంత హైట్, వెయిట్ ఎవరికి లేదు, ఆయనను ఇప్పడు కూడా బాహుబలి అంటారు. అందరు ఇప్పుడు సినీ హీరోల కోసం వెంపర్లాడుతున్న తరుణంలో ఆల్ రెడి తన వద్దనే ఉన్న ఆ ఆరున్నర అడుగుల రెబల్ స్టార్, పైగా తన సీనియర్ నటుడిని చిరంజీవి అందనంత దూరంలో ఎందుకు పెట్టారో రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావడంలేదు.
చిరంజీవి ఆయను దూరంగా ఉంచాడా, లేక చిరంజీవి కే రెబల్ స్టార్ దూరంగా ఉంటున్నారా.. అన్నది పక్కన బెడితే ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా చాలా చక్కటి పేరున్న క్రిష్ణంరాజు మాత్రం ఇప్పుడు చిరంజీవి వెంట కాదు కదా రాజకీయ తెరపైనే కనిపించడం లేదు. అందుకే అలనాటి రాజుల వైభవానికి ప్రతీకగా నిలిచిన రాజమహేంద్రవరం తో పాటు రాష్ట్రం యావత్తు ఆ ఆరున్నర అడుగుల హీరో గూర్చి ఆలోచిస్థున్నారు.
సినిమాలు వదులుకున్నాక క్రిష్ణంరాజు బిజేపిలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. రావడమే కాదు ఆయన ఇమేజి, క్రేజి, మంచితనం ఆయనను నరసాపురం ఎంపీగా ఏకంగా రెండుసార్లు గెలిపించింది. అంతేకాదు వాజ్ పాయ్ ప్రభుత్వంలో క్రిష్ణం రాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. తన సహచరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టి పెట్టడంతో క్రిష్టంరాజు చిరంజీవి సరసన చేరారు.
చిరంజీవి కూడా క్రిష్ణంరాజును రాజమండ్రి నుండి ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చారు. అయితే టిడిపి నుంచి మురళీమోహన్, కాంగ్రేస్ నుంచి ఉండవల్లి వంటి వారు ఉండడంతో ఓటమి పాలయ్యారు. ఆతర్వాత చిరంజీవి కూడా పార్టీని పాతరేసి కాంగ్రేస్ లో కలిసిపోయాడు. అయితే కాంగ్రేస్ అంటే పడని క్రిష్ణంరాజే ఇక చిరంజీవి తో బంధం తెంచుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్థున్నారు. కారణం ఏమయినా మరో సినీతార రాజకీయతెరపై నుంచి అదృష్యమయ్యాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: