ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశంపై ముఖ్యంగా ఐటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రి లోకేష్ పై కొన్ని వ్యంగమైన కార్టూన్లు, పోస్టింగ్ లు చేశారని పొలిటికల్ పంచ్ రవికిరణ్ ని ఏపి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  అయితే రవికిరణ్ వైసీపి కి చెందిన వ్యక్తి గా వార్తలు వచ్చిన నేపథ్యంలో పొలిటికల్ పంచ్ రవికిరణ్ తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వైసీపీకి ఉన్న లక్షలాది మంది మద్దతుదారుల్లో రవికిరణ్ కూడా ఒకడని చెప్పారు.


 తాజాగా  రవికిరణ్ కేసు విషయంలో మధుసూదర్ రెడ్డి అమరావతి పోలీసుల విచారణకు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కు వ్యతిరేకంగా తాము ఎలాంటి పోస్టులు పెట్టలేదని... భవిష్యత్తులో కూడా పెట్టమని తెలిపారు. కేవలం ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే పోస్టింగ్ లు పెడతామని చెప్పారు.  


రవికిరణ్ కి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కూడా చెప్పానని అన్నారు.  గతంలో తమ అధినేత జగన్ పై, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అసభ్యకరమైన పోస్టులు పెట్టిందని... వీటిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మధుసూదన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: