సోషల్ మీడియాపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అసలు సోషల్ మీడియాలో పోస్టుల యుద్దాన్ని ప్రారంభించిన వారే ఇప్పుడు నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికై.. ఎన్నికైన కొన్ని రోజుల్లోనే మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేశ్ పై పెట్టిన పోస్టులే ఈ మార్పుకు కారణమన్న సంగతి తెలిసిందే. 

Image result for lokesh and social media photos

ఇప్పుడు నారా లోకేశ్ మెప్పు పొందేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్లో మంత్రులు కూడా పోటీపడుతున్నారు. తాజాగా కొత్తగా మంత్రి పదవి పొందిన ఓ మంత్రి గారి లోకేశ్ ను ప్లీజ్ చేసేందుకు ఏకంగా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కూడా. 


Image result for lokesh and social media photos
ఆయనే మంత్రి పితాని సత్యనారాయణ గారు. భాషా ఇబ్బందుల వల్ల ఉపన్యాసంలో తొట్రు పాట్లు వస్తే ఎలక్ట్రానిక్ మీడియా నానా రభసా చేస్తోందట. గతంలో ప్రింట్ మీడియా ఒక్కటే ఉన్నప్పుడు ఈ సమస్యలేదట. వారు కేవలం భావం అర్థం చేసుకుని వార్తలు రాసేవారట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత రేటింగ్ కోసం ఇలాంటి తప్పులను పదే పదే ప్రసారం చేస్తున్నారట. 

Image result for MINISTER PITANI SATYANARAYANA

ప్రత్యేకించి ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ పై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పితాని వారు భలే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీలు, సామాజిక మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అంటే తప్పు ఎలక్ట్రానిక్ మీడియాది, సోషల్ మీడియాదే తప్ప.. సరిగ్గా మాట్లాడటం రాని నేతలది కాదన్నమాట. కొసమెరుపేమిటంటే.. మంత్రిగారు ఇలా మాట్లాడిన అదే కార్యక్రమంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. వాస్తవానికి లోకేశ్ ఉన్నాడనే మంత్రి పితాని గారు ఆ రేంజ్ లో క్లాస్ పీకారు. మరి లోకేశ్ ప్లీజ్ అయ్యారో లేదో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: