బాహుబలి2 విడుదల దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాలకు సినీ ఫీవర్ పట్టుకుంది. ఓ వైపు టికెట్ల వేట మొదలైంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు ఎంతో అత్రుతగా నిరీక్షిస్తున్నారు. టికెట్ ధర ఎంతయినా ఫర్లేదు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అని ఫిక్సయ్యారు. ఐఏఎస్ అధికారులు సైతం బాహుబలి-2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి గత పదిహేను రోజులుగా వరంగల్‌ నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 



వారి కోసం బాహుబలి-2 సినిమాకి 350 టికెట్లను ఇప్పటికే బుక్‌ చేసి ఉంచారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నగర సుందరీకరణ పనుల్లో దాదాపు 200 మంది అధికారులు, ఉద్యోగులు, 100 మంది ఆర్టిస్టులు పాలుపంచుకుంటున్నారు. ఈ స్పెషల్ షోకు ఎవరికి ఆహ్వానం దక్కుతుందా? అని పలువురు ఎదురుచూస్తున్నారు. ఈ యంగ్ కలెక్టర్‌‌ ఈ షోకి అధికారులను కూడా ఆహ్వానిస్తారా? అనే చర్చ జరుగుతోంది. స్థానిక నాయకులకు తన స్నేహితులతోపాటు కలెక్టరేట్ అధికారుల కుటుంబాలకు ఆమ్రపాలి ఈ స్పెషల్ షోకు ఆహ్వానం పంపనున్నారని తెలుస్తోంది.


Image result for collector amrapali wiki

ఓ కలెక్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఇంతలా ఆసక్తి చూపుతుంటే సగటు అభిమాని పరిస్థితి ఏంటి? అని అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నగర్ సుందరీకరణ పనుల్లో బిజీ గా ఉన్నవారికి కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు బాహుబలి టికెట్లను వరంగల్‌ ఆర్డీవో ద్వారా బుక్‌ చేయించినట్టు తెలుస్తోంది. హన్మకొండలో ని ఏసియన మాల్‌లో 28నవారంతా ఫస్ట్‌ షో చూడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: