హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశా.. మాదాపూర్ గుట్టలను సైబరాబాద్ గా మార్చా.. అందుకోసం కాళ్లకు చెప్పుల్లేకుండా అమెరికాలో తిరిగా.. కాలినడకన సిలికాన్ వ్యాలీలో తిరిగి మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు హైదరాబాద్ కు వచ్చేలా చేశా.. ఇలాంటి మాటలు చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటే ఈయనకు బాగా సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడని అనిపించడం సహజం. 


ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా.. అందులో ఉన్నదంతా వాస్తవమే అన్న సంగతి మాత్రం మరిచిపోకూడదు. ఇప్పుడు చంద్రబాబు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాపిల్ కంపెనీ తన హార్డ్ వేర్ యూనిట్ ను త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతోందట.  ఈ విషయం స్వయంగా చంద్రబాబు తన పార్టీ నేతలకు చెప్పారు. 


యాపిల్ కంపెనీ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వేల రూపాయల ఖరీదైనా సరే.. ఆ కంపెనీ ఫోన్ చేతిలో ఉండటం ప్రెస్టీజ్ గా భావిస్తారు చాలామంది. అలాంటి కంపెనీ హార్డ్ వేర్ యూనిట్ కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది. ఈ పరిశ్రమ చిత్తూరు జిల్లాలో ఏర్పాటైతే.. కనీసం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెప్పారట. ఒక్క కంపెనీతోనే అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. అసలు యాపిల్ కంపెనీ రాక  అంటే మామూలు విషయం కాదు కదా.

sricity కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ లో అనేక దేశ, విదేశాలకు  చెందిన కంపెనీలు తన పరిశ్రమలను నడుపుతున్నాయి. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ రెడ్ మీ కూడా తన యూనిట్ ద్వారా ఉత్పత్తి ప్రారంభించింది. ఇప్పుడు ఇండియాలో అమ్మే ఫోన్లన్నీ శ్రీసిటీ యూనిట్ లో తయారైనవే. ఏదేమైనా చంద్రబాబా మజాకానా.. అనుకుంటూ కాలర్ ఎగరేస్తున్నారు టీడీపీ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: