MCD election results కోసం చిత్ర ఫలితం




డిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలో బాజపా ప్రభంజనం బాజపా, మోదీ, షా ల ప్రతాపం మాత్రం కాదు. ఈ బాజపా ప్రభంజన విజయం మాత్రం డిల్లీ నాగరికులక గుండె ల నుండి అరవింద్ కేజ్రీవాల్ పై పెల్లుబికిన లావా లాంటి ఆగ్రహం, విస్పోఠనం. మోడీ మోడల్ విజయవంతంగా పనిచేస్తుందని చెప్పటానికి అనుమానమే అక్కరలేదు. తాము గెలిస్తే ముఖ్యమంత్రెవరో చెప్పకుండానే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో తన విజయ రధాన్ని నడిపారు మోడీ షా ద్వయం. ఇక్కడ ముంచుకు రానున్న ప్రమా దం "పార్టీని మించి ఎదుగుతున్న మోడీ" నిర్వివాధం గా ఇది నిజం, అంటున్నారు డిల్లీ నగర వాసులు.


MCD election results కోసం చిత్ర ఫలితం


      

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉంది. ఈ లోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్ని కల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసు కెళ్తోంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా, 185 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.


కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా కార్పొరేషన్లను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి.


బాజపా విజయ వేగం చూస్తుంటే "డిల్లీ నగర (పుర) వీధులని దశాబ్ధం పాటు చీపుర్లు పట్టుకొని ఊడ్చినా అరవింద్ కేజ్రీవాల్ గాంగ్ ని "డెలైట్స్" ఒక జీవిత కాలం నమ్మరు" అంటున్నారు డిల్లీ నగర వాసులు    

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం (ఉదయం 10 గంటల సమయానికి) బీజేపీ స్పష్టమైన అధిక్యత దిశగా దూసుకెళు తుండగా.. రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫలితాలు వెలువడిన తొలి గంట లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలవగా,  ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి దిగజారినట్లు కనిపించింది. అయితే, కౌంటింగ్ కొన సాగుతున్న కొద్దీ.. ఆమ్ ఆద్మీ పుంజుకొని రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈవీఎం వివాదా లు.. ఢిల్లీ అభివృద్ధి మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్న విమర్శలు, ఆరోపణలు, ఢిల్లీ ప్రజారోగ్యం విషయంలో అధికారపార్టీ విఫలం కావటం, ఆమ్ ఆద్మీ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావన వ్యక్తమవుతోంది.


వీళ్ళు,  వీళ్ళ ధారుణ ఎన్నికల పరాభవాన్ని వస్త్రాపహరణాన్ని ఈవీఎం లపై నేట్టేసే పథక రచన చేయక మానరు. మనకు అనుమానం, సంకోచం ససేమిరా అవసరం లేదు. ముందుగానే నగర ప్రముఖులు విద్యావేత్తలు అంటున్నారు.  


ఎంసిడి ఎన్నికల విజయం కోసం ఇక నిరీక్షించనవసరం లేదు. విజయ బాజపాకు సంపూర్ణం.  


MCD election results  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: