cancellation of public holidays by UP CM yogi కోసం చిత్ర ఫలితం



కొన్ని నిర్ణయాలను అతివేగంగా చేయాలి. భారత లాంటి దేశానికి "పని సంస్కృతి" చాలా అవసరం. కాని ప్రతి రాజకీయ నాయకుడు వారి రాజకీయ అవసరాలకోసం "ఓటు బాంక్ నిల్వ" లను పెంచుకోవటం కోసం "పని సంస్కృతి" నే దెబ్బ కొడుతున్నారు. ఉదాహరణకు కొన్ని పరిశీలిద్ధాం.


నాయకుల వర్ధంతులను జాతీయ సెలవుదినాలుగా ప్రకటించటం.  మహాత్మాగాంధి జయంతి, అంబెద్కర్ జయంతి, జగజ్జీవన్ రాం జయంతి నెహృ జయంతి వీటికి సెలవు లివ్వటం అవసరమా! మహనీయుల జయంతు లను ఒక పరమార్ధానికి చిహ్నంగా భావిస్తూ వారి విలువలు గుర్తు చేసుకుంటూ ఆరోజున వారి జీవన మార్గమే శ్రేయోదాయకం గా మరికొంత సేవ చెయ్యాల్సిన తరుణంలో దానికి సెలవు ప్రకటించటం ఎలా సబబు?  సేవ వారాశించిన దారిలో చెయ్యాలి. అంతేగాని సెలవు లివ్వటమేమిటి? దగా కోరు వ్యవహారం కాక,  ఇది మరేమిటి. 


 cancellation of public holidays by UP CM yogi కోసం చిత్ర ఫలితం


"చేతిలో ఎంత అధికారం ఉన్నా! కొన్ని విషయాల్ని అస్సలు "టచ్"  చేయకూడదు. పవర్ లో ఉన్నా! కొందరి తో కొన్నింటితో అస్సలు పెట్టుకోకూడదు. చూసీ, చూడ నట్లుగా వదిలేయాలి"  ఇలాంటి ఇలా అడ్డదిడ్డమైన  సలహాలు, సూచనలు చేసే వారి ని అస్సలు పట్టించుకోకూడదని యూపి రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మారు. కనకనే మిగిలిన వారికి భిన్నంగా, తానేం చేయాలను కుంటున్నారో తనకు తాను క్లారిటీ తో చేసుకుంటూ పోతున్నారు.


ఇప్పటికే తన నిర్ణయాలతో పాలనలో పరుగు, పనుల్లో ఉరుకులు, సాధనలో పరుగులు పెట్టిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ తనకు సహజమైన పద్దతిలో తాజాగా మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి తనపాలనకు ముందున్న "సెలవుల కాలండర్" జోలికే వెళ్లరు. "అడుసు తొక్కనేల కాలు కడుగ నేల"  అన్నట్లు. కానీ అందరికీ భిన్నం గా యోగీ సాబ్ అతి భారీ నిర్ణయమే తీసుకున్నారు.


up government holidays 2017 కోసం చిత్ర ఫలితం


మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే, ఉత్తరప్రదేశ్ లో సెలవులు చాలా చాలా ఎక్కువ. పండగలు,  ప్రముఖుల పుట్టిన రోజులు, పండు గల రోజులు, ఇతర అనేక అర్ధం కాని  కార్య క్రమాల కోసం గత ప్రభుత్వాలు అంతులేని సంఖ్యలో సెలువులు ఇచ్చేశాయి. ఇతర రాష్ట్రాల (తెలుగు రాష్ట్రాలతో కలిపి) సెలవుల్ని పరిశీలించి, కంపేర్ చేసి చూస్తే, ఇలాంటి సెలువలు ఏడాదికి 15 నుంచి 20 వరకూ కనిపిస్తాయి. 


కానీ, ఉత్తర్ప్రదేశ్ లో మాత్రం ఈ సెలవులు ఏకం గా 42 ప్రభుత్వ సెలవుదినాలుగా అంటే  సుమారు 11.5% రోజులు సెలవులే వాటిలో శని ఆది వారాలు కలుప కుండానే కనిపిస్తాయి.  దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం యోగి అదిత్యనాథ్, ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇచ్చే సెలవుల్ని రద్దు చేసే కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయం తో, ఇప్పటికే అమలులో ఉన్న సెలవుల్లో ఏకంగా 15 సెలవుల్ని రద్దు చేస్తూ దస్త్రం పై దస్కత్తు చేసేశారు.



Bihar Govt. Calendar 2017, Bihar govt. holiday list, Holiday list ...

ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తొలినాడే తనతో రోజూ 18 - 20 గంటలు పని చేసే పనిమంతులే ఉండాలన్న నిబం ధన పెట్టి దానికనుగుణంగానే, వ్యవహరిస్తు న్నారు. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలౌతున్న ప్రభుత్వ సెలవు దినాలని  ఇంత పెద్ద స్థాయిలో కోత పెట్టే సాహసానికి ఏ ముఖ్యమంత్రి పూనుకోలేదు. అంత ధమ్మున్న ముఖ్యమంత్రే దేశం లో అధికారములోకి  రాలెదనే అర్ధం.



సాంప్రదాయానికి భిన్నంగా తొలిసారి యోగి ఆధిత్యనాధ్ ఒక్కసారే 15 సెలవులకు కోత పెట్టిన విషయం ఉత్తరప్రదేశ్ ఉద్యోగ  సమాజం లో సెగలు పుట్టిస్తుంది. గతంలో కేంద్రం సెలవుల్ని తగ్గించే ప్రయత్నాలు చేయగా, ఉద్యోగ సంఘాలనుండి వచ్చిన నిరసనతో వెనక్కి తగ్గాల్సి వచ్చిది. అందుకు భిన్నంగా యోగి మాత్రం తనదైన పద్దతి లో ఒక్క కలం పోటుతో పదిహేను సెలవులకు కోత పెట్టి ఒక సారే  5%  పనిదినాలని పెంచేయటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: