వెండితెర అద్భుత కావ్యం బాహుబలి2 చిత్రం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో నేటి నుంచి టిక్కెట్లు అమ్ముతున్నారు. టిక్కెట్లు దక్కించుకునేందుకు తెల్లవారుజామునుంచే అభిమానులు ఐమ్యాక్స్‌ వద్ద బారులు తీరారు. మండుటెండలో గంటల తరబడి క్యూలైన్లల్లో వేచి ఉండి టిక్కెట్లు దక్కించుకుంటున్నారు. 



తెల్లవారుజాము నుంచి వేచి చూసిన అభిమానులు నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బిగ్ స్క్రీన్ పై రూ. 250, నార్మల్ స్క్రీన్స్ పై రూ. 150 టికెట్ రేటుగా ఉండగా, నార్మల్ స్క్రీన్ పై రూ. 250కి టికెట్లను సిబ్బంది విక్రయిస్తుండటంతో, పలువురు అభిమానులు గొడవకు దిగారు. రూ. 150 సినిమా టికెట్ ను కాంబో పేరుతో మరో వంద రూపాయలు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. 



రేపు రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న, ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ 'బాహుబలి: ది కన్ క్లూజన్' తొలి రోజు కలెక్షన్ల అంచనాపై సినీ విశ్లేషకులు ఓ అభిప్రాయానికి వచ్చారు.ఈ చిత్రం తొలి రోజున రూ. 150 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్క ఎలాగంటే, ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లకు పైగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. 8 వేల థియేటర్లలో తొలి రోజున 5 షోల చొప్పున ప్రదర్శిస్తే, మొత్తం 40 వేల షోలు పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: