ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో రెండు రోజుల క్రితం మావోయిస్టుల ఘాతుకానికి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైపోయిన విషయం తెలిసిందే. జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి వెనుక మాస్టర్ మైండ్ ఎవరిదన్న విషయమై పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. సుమారు మూడు వందల మంది మావోయిస్టులు ఈ మెరుపు దాడికి పాల్పడినట్టు బాధిత సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు చెప్పడం విదితమే. అయితే, ఇంత పకడ్బందీగా వ్యూహ రచన చేసి, దానిని అమలు చేసిన ‘మాస్టర్ మైండ్’ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 


Image result for మావోయిస్టుల కాల్పుల్లో 26మంది జవాన్ల మృతి...!!

ఈ మారణకాండకు సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్‌ మిలిటరీ బెటాలియన్‌ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు పోలీసులు బుధవారం తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) మొదటి మిలిటరీ బెటాలియన్ కు మద్వి హిద్మా నేతృత్వం వహిస్తున్నారు. బస్రత్ లోని కరుడు గట్టిన మావోయిస్టులలో హిద్మా కూడా ఒకరు !. దక్షిణ సుక్మా, దంతెవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో కార్యకలాపాలకు హిద్మా నేతృత్వం వహిస్తున్నారు. బక్క పలచని హిద్మా మచ్చలేని రెబల్ లీడర్ గా గుర్తింపు పొందాడు.  


Image result for మావోయిస్టు కమాండర్ హిద్మా?

హిద్మా స్వస్థలం దక్షిణ సుక్మా జిల్లాలోని పుర్వతి గ్రామం. ఇతనిని హిద్మల్, సంతోష్ గా పిలుస్తుంటారు. గత మార్చి 11న 12 మంది భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న దాడి వెనుక కూడా హిద్మా అలియాస్‌ హిద్మాలు, అలియాస్‌ సంతోష్‌ ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 2010 తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 2010లో సుకుమా పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించారు. ఆ తరువాత మళ్లీ ఏడేళ్లకు దక్షిణ సుకుమా జిల్లాలో మళ్లీ మావోయిస్టులు భారీ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: