ఉమ్మడి హైకోర్టు మళ్లీ కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ తీసుకున్న చాలా నిర్ణయాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ లో నాన్ లోకల్ ఇష్యూ మొదలుకుని.. మొన్నటి సింగరేణి వారసత్వ ఉద్యోగాల వరకూ కేసీఆర్ కు చాలా విషయాల్లో చుక్కెదురైంది. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ విషయంలోనూ అదే జరిగింది. 


కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరించేందుకు తెలంగాణ సర్కారు గతేడాది ఫిబ్రవరి 26న ఓ జారీ చేసింది. దీనిపై కొందరు నిరుద్యోగులు పిల్ దాఖలు చేశారు. ఈ జీవో వల్ల అర్హులైన వారికి ఉద్యోగాలు కరవవుతాయని వాదించారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు శాఖల్లో ఒప్పంద ఉద్యోగులుగా నియమితులై గత 5 నుంచి 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్న వారిని ప్రస్తుతం క్రమబద్దీకరిస్తోందన్నారు. 


ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని ఆ కమిటీ నిర్ణయం మేరకే క్రమబద్దీకరణ చేస్తున్నామని సర్కారు వాదించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్షన్ 10-ఏ 2006లో "స్టేటాఫ్ కర్నాటక వర్సెస్ ఉమాదేవి" కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అన్నారు. సెక్షన్ 10-ఏ క్రమబద్ధీకరించేందుకు అధికారులకు అనుమతిచ్చేదిగా ఉందన్నారు. 



వేలమంది ఉద్యోగాల్ని క్రమబద్ధీకరిస్తుంటే నిరుద్యోగుల  పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో దాఖలైన వ్యాజ్యంలో ఎలాంటి క్రబద్దీకరణలు చేపట్టబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ తాజాగా ఉద్యోగాల్ని క్రమబద్ధీకరిస్తోందని వాదించారు. ఆ తీర్పు ప్రకారం 2006 తర్వాత క్రమబద్దీకరించడానికి వీల్లేదన్నారు.  ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం..1996 ఏప్రిల్ 10 తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎంపికైన వారిని రెగ్యులరైజ్ చేయవద్దని ఆదేశించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: