Image result for gayatri prajapati & supreme court


ఉత్తర ప్రదేశ్ లో చట్టం చట్టుబండలైంది. న్యాయాదీశుడొకరు బెయిల్ యివ్వ తగని కేసులో ఇచ్చినందుకు గాను ఆయనని సస్పెన్షన్ కు అదేశించింది సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్.  సామూహిక అత్యాచారం కేసు లో నిందితుడి గా ఉన్న ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన ఘటనలో న్యాయమూర్తిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టు ఆయన కు బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా ఈ విషయాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం గాయత్రి ప్రజాపతికి మంజూరైన బెయిన్‌ను రద్దు చేసింది. అలాగే ప్రత్యేక కోర్టు జడ్జీని విధులను నుంచి తాత్కాలికంగా పక్కనబెట్టింది. శాఖాపరమైన దర్యాప్తు నకు సైతం ఆదేశించింది.

 

అప్పటి అఖిలేష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గాయత్రి ప్రజాపతి అక్టోబర్ 2014 నుంచి జూలై 2016 వరకు వరుసగా ఓ మహిళ పై లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చాడు. అనంతరం ఆమె కూతురిని కూడా లైంగికంగా వేధించాలని యత్నించాడు. ఇక తాళలేక ఆ మహిళ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గానీ, ఇతర ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా బాధిత మహిళ సర్వోన్నత న్యాయస్థానం లో తన కేసు పై న్యాయం కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల తో యూపీ పోలీసులు ప్రజాపతి ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Image result for gayatri prajapati & supreme court

మరింత సమాచారం తెలుసుకోండి: