వెనకట రాజులు తమ ప్రయాణాలను గుర్రం పై చేసేవారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాను రాను ఈ గుర్రాలు కనుమరుగయ్యాయి, వాటి స్థానంలో వాహనాలు వచ్చేశాయి. అయితే నేటి ఆధునిక కాలంలో పెళ్లి కొడుకును గుర్రం పై ఊరేగించడం ఆనవాయితీ గా వస్తుంది. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్. అంతేకాక పెళ్లి కొడుకు గుర్రం పై ఊరేగడం అనేది చాలా గొప్ప విషయం గా కూడా భావిస్తున్నారు. అయితే ఈ సాంప్రదాయం దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో ఎక్కువగా అమలులో ఉంది. 


Image result for maharashtra groom in horse

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ష్రిగొండలో ఓ వింత సంఘటన ఎదురైంది. పెళ్లి కొడుకును గుర్రం పై ఊరేగించాలని భావించిన బంధువులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి కొడుకు గుర్రం పైకి ఎక్కాడు. గుర్రం యజమాని ఆ గుర్రంతో కొన్ని ఫీట్లు చేయిస్తున్నాడు. అప్పటి వరకు యజమాని చెప్పిన విధంగా నడుచుకుంటున్న గుర్రం ఒక్క సారిగా అదుపు తప్పింది.  ఒక్క‌సారిగా బెదిరిపోయిన ఆ గుర్రం అక్క‌డి నుంచి దూరంగా ప‌రుగు తీసింది.


Image result for maharashtra groom in horse

ఆ గుర్రంపైనే ఉన్న పెళ్లి కొడుకు ఎక్క‌డికో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గుర్రంపైనే వ‌రుడు ఉండ‌డంతో అక్క‌డ ఉన్న బంధువులంతా గుర్రం వెనుకాలే పరుగు తీశారు. చివ‌రికి ఏమైంద‌నే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు. ఈ ఆసక్తికర వీడియోను మీరూ చూడండి...

మరింత సమాచారం తెలుసుకోండి: