నేరసామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ మాఫియా డాన్ గా ఎదిగాడు దావుద్. బాగా డబ్బు సంపాదించడంతో పాటు చేసిన నేరాలు కూడా దావూద్ ను ప్రత్యేకమైన మనిషిగా చేశాయి. దీనిని క్యాష్ చేసుకున్న దావూద్ ఇబ్రహీం పౌరుల భయాన్నే వ్యాపారం చేసుకున్నాడు. గాడ్ ఫాదర్ తరహాలో పటిష్ఠమైన నెట్ వర్క్ తో ముంబైలోని వివిధ ప్రాంతాల్లో తన హవాను చాటుకున్నాడు. అలాంటి దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నప్పటికీ...ఆయన అనుచరులు అవన్నీ పుకార్లు అంటూ కొట్టిపడేస్తున్నారు.


Image result for davud ibrahim

అయితే నేర సామ్రాజ్యాన్ని ఏకతాటిపై నడిపేందుకు దావూద్ అనుచరులు ఈ డ్రామా ఆడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతడు గుండెపోటుతో కరాచీలోని ఆగాఖాన్‌ ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను దావూద్‌ చిరకాల సన్నిహితుడు చోటా షకీల్‌ తోసిపుచ్చారు. దావూద్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఓ టీవీ చానల్‌కు చెప్పాడు. 1955 డిసెంబర్ 27న దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు.


Image result for davud ibrahim

కాల క్రమంలో తల్లితో కలిసి ముంబైలోని డోంగ్రీ ఏరియాలో ప్రాధమిక విద్యనభ్యసించాడు. హైస్కూల్ రోజుల్లోనే చదువు మానేశాడు. తరువాత హాజీమస్తాన్ తో సంబంధాలు దావూద్ ను తిరుగులేని గ్యాంగ్ స్టర్ గా మార్చాయి. దావూద్ ఇబ్రహీం చనిపోయాడని ప్రకటిస్తే...అతని నేరసామ్రాజ్యం మొత్తం కూకటి వేళ్లతో పెకిలించబడుతుంది. అతని అనుచరులే తిరగబడి అతని ఆస్తులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే... దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడని అతని అనుచరులు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: