Image result for aravind kejival




డిల్లీ ప్రజానీకం తనమాటలు నమ్మి డెబ్బై అస్సెంబ్లి సీట్లకుగాను 67 సీట్లలో గెలిపించి అద్భుతవిజయం ప్రసాధించారు. అయినా దురాశాపరులైన ఆప్ నాయకత్వబృందం డిల్లీ పాలనను గాలికివదిలేసి గోవా, పంజాబ్ అంటూ "కొంప వదిలేసి కొట్టం మీదపడి" యెవరినీ వదలకుండా అందరినీ విమర్శిస్తూ తానేమో గొప్పపాలకుడుగాఫీలయ్యారు. ఆయన గొడవ పెట్టుకోని వ్యవస్థే లేదు లెఫ్టినెంట్ జనరల్ నుంచి మోడీ వరకు అందరితో న్యూసెన్సే. ఈవీయం లను అడ్డుపెట్టుకొని ఎన్నికల సంఘంతోనూ గొడవలే.


పశ్చిమ బంగలో మమతతో, బిహార్ లో లాలుతో, యూపిలో మాయ తో జతకట్టి బాజపా పై యుద్ధం చేసే పనిలో ఆయన ఉంటే ఇక్కడ డిల్లీలో అమిత్ షా అంతా చక్కబెట్టేసి కేజ్రివాల్ మూలాల్లోనే మంట పెట్టారు. కేంద్రం తో విభేదాలున్నా పాలన కవసరమైన సహాకారం పొందేఅవకాశం డిల్లీ ప్రజానీకం కోలోయారు. చివరికి అరవింద్ కేజ్రివాల్ అంటే అరాచకానికి చేతకాని తనానికి ఋజువుగా మిగిలిపోయారని డెళ్ళీ వాసులు గళమెత్తి చెపుతున్నారు. 


Image result for mamata maaya aravind




పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి తోడు, సొంతగడ్డ ఢిల్లీలో జరిగిన మూడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలక ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీరుపై సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌లో ఆప్‌ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకుంటున్నారన్న వార్తలు కేజ్రీవాల్‌ను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాము తప్పులు చేశామని శనివారం అంగీకరించారు. చేసిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 70 స్థానాలకు గాను 67 సీట్లు గెలుపొందిన ఆ పార్టీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగి స్తుందని కేజ్రీవాల్‌, ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.


ప్రచారం సందర్భంగా, బీజేపీకి ఓటేస్తే డెంగీనో, మలేరియానో వస్తే తమ బాధ్యత లేదని ఆయన ప్రకటించడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 272 వార్డులకు ఎన్నికలు జరిగితే ఆప్‌ అతి కష్టమ్మీద 48 సీట్లు గెలిచింది. 3 కార్పొరేషన్లలోనూ బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. కేజ్రీవాల్‌పై ఆప్‌ నేతలు తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుతుండడంతో ఆయన శనివారం చిన్నపాటి ప్రకటనను ట్వీట్‌ చేశారు. గత రెండ్రోజుల్లో పార్టీ కార్యకర్తలు, ఓటర్లతో సంప్రదింపులు జరిపానని, మళ్లీ అందరం కలిసి కూర్చుని చర్చించుకోవాల్సిన అవసరమున్నట్లు స్పష్టమైందని అందులో తెలిపారు. 


Image result for mamata maaya aravind



ఓటమికి సాకులు వెదక్కుండా కార్యాచరణకు ఉపక్రమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాగా పార్టీ ఓటమికి ఈవీఎం లు కారణమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలి తాల తర్వాత, ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారసమయంలో ఊదరగొట్టి, సాక్షాత్తూ ఎన్నికల కమిషన్‌నే ఆయన టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే కార్పొరేషన్‌ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన ఈవీఎంల ఊసే ఎత్తలేదు. తాజా ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. గత గురువారం కౌన్సిలర్లతో భేటీ అయిన కేజ్రీవాల్‌, పార్టీ ఫిరా యించబోమని వారితో ప్రమాణం చేయించడం గమనార్హం.



Image result for arvind kejriwal

మరింత సమాచారం తెలుసుకోండి: