జేఈఈ పరీక్షల్లో మోహన్ అభ్యాస్ అనే తెలుగు విద్యార్థి ఆల్ ఇండియాలో ఆరో ర్యాంకు సంపాదించాడు. ఐతే.. ఈ విద్యార్థి తమ వద్దే చదువుకున్నాడని.. ఆ మరుసటి రోజే నారాయణ శ్రీ చైతన్య విద్యాససంస్థలు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చుకున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఐతే.. మరుసటి రోజు ఉదయం ప్రధాన పేపర్లు చూసిన వారికి మరోసారి షాక్ తగిలింది. 



ఈసారి ఆకాశ్ అకాడమీ వాళ్లు అదే మోహన్ అభ్యాస్ తమ విద్యార్థి అని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చుకున్నాయి. అంతేకాదు.. సదరు మోహన్ అభ్యాస్ తమ కళాశాల గురించి ఏం రాశాడో చూడండి.. అని మోహన్ అభ్యాస్ పేరుతో ఉన్న లేఖను ప్రచురించాయి. తన విజయానికి ఆకాశ్ సంస్థలో చదువుకోవడమే కారణమని మోహన్ అభ్యాస్ రాసినట్టు అందులో ఉంది. 

MOHAN ABHYAS NARAYANA కోసం చిత్ర ఫలితం

ఆకాశ్ యాడ్ తో నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల పరువు గంగలో కలిసినట్టయింది. అసలు ఇంతకీ ఈ మోహన్ అభ్యాస్ ఎవరి విద్యార్థో అర్థంకాక విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. మోహన్ అభ్యాస్ ఉదంతం తమకు చెడ్డపేరు తెస్తోందని గ్రహించిన నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలు సదరు విద్యార్థి మోహన్ అభ్యాస్ తో ప్రెస్ మీట్ పెట్టించాయి. 




నారాయణ-చైతన్య విద్యాసంస్థల్లో చదివిన తాను జేఈఈ పరీక్షల్లో ఆల్ ఇండియా 6వ ర్యాంకు సాధిస్తే... మరో విద్యాసంస్థ తరపున చదివినట్లు ప్రచారం చేసుకోవడం బాధగా ఉందని మోహన్ అభ్యాస్ అనే సదరు విద్యార్థి ప్రెస్ మీట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. జేఈఈ ఆరో ర్యాంకు సాధించిన మోహన్ అభ్యాస్ అనే విద్యార్థి తమ విద్యాసంస్థ విద్యార్థేనని మరో ప్రైవేటు విద్యాసంస్థ ప్రచారం చేసుకుంటోందని నారాయణ-చైతన్య విద్యాసంస్థలు అంటున్నాయి. ఆ ప్రైవేటు విద్యాసంస్థలో ఓసారి పరీక్ష రాయడానికి వెళ్లినంత మాత్రాన ఆ సంస్థ తరపున జేఈఈ పరీక్ష రాసినట్లు ఎలా అవుతుందని.. మోహన్ అభ్యాస్ అంటున్నాడు. ఈ మోహన్ అభ్యాస్ ఎవరైనా.. ర్యాంకర్ల కొనుగోలు వాస్తవమేనని.. మరోసారి రుజువైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: