చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఉదయం ఆయన్ను కలిసిన శిల్పా సోదరులు మోహన్ రెడ్డి, చక్రపాణిరెడ్డిలు నంద్యాల అసెంబ్లీ సీటు విషయమై ఆయనతో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. శిల్పామోహన్‌రెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ​‍'2014లో పార్టీ తరఫున నేనే పోటీ చేశా. ఈసారి కూడా టికెట్‌ నాకు ఇవ్వడమే న్యాయం. మేం అన్ని రకాలుగా నష్టపోయాం’ అని సీఎంను కలిసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. 


Image result for chandrababu bhuma akhila priya shilpa mohan reddy

భూమా కుటుంబం కూడా టిక్కెట్ కావాలని కోరుతున్నారని, కానీ గత ఎన్నికల్లో తాను పోటీ చేసినందున ఇప్పుడు కూడా నాకే ఇవ్వాలని చెప్పానన్నారు. ఎవరిని పోటీకి నిలపాలన్న నిర్ణయాధికారం చంద్రబాబుదేనని తెలిపారు. తమకు సీటు ఇవ్వాలా? వద్దా? అన్నది సీఎం నిర్ణయిస్తారని, తమకు అన్యాయం జరగబోదని భావిస్తున్నామని, చంద్రబాబు నోటి నుంచి ఎవరి పేరు వచ్చినా సమ్మతమేనని అన్నారు. భూమా వర్గం కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు.


Image result for chandrababu bhuma akhila priya shilpa mohan reddy

భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాల ఉప ఎన్నిక నగారా మోగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్థానానికి పోటీపడుతున్న ఇద్దరూ బాబుకు మంచి సన్నిహితులు కావడంతో బాబు ఎటూ తేల్చుకోలేక మాధనపడుతునట్లు తెలుస్తోంది. వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తికి ఇందులో అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది..? అన్న ఆలోచనలో కూడా బాబులో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: