ఫీజుల విషయంలో ప్రభుత్వాన్ని శాసించేస్థాయికి ఎదిగిన ఇంజనీరింగ్ ఇతర వృత్తివిద్యా కళాశాలలను నియంత్రించటానికికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కానీ జిల్లా సౌకర్యాలను తనిఖీ చేయటానికి పోలీసులు ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఒక ఉన్నతస్థాయి కమిటిని నియమించడం మరో మంచి పరిణామం తల్లిదండ్రుల ఆర్థిక స్థితి తెలుసుకోకుండా లేదా తెలిసిన కూడా తమ పిల్లలకు సీట్లు ఇచ్చే విషయంలోపై కచ్ఛితం అన్నట్లుగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ  ఇన్నాళ్లు సరస్వతిపైనే ఆజమాయిషి చెలాయించిన వృత్తివిద్యా కాలేజీల వైఖరితో విసిగివేసారిపోయిన తల్లిదండ్రులు ఈ పరిణామాలు చూసి పిల్లల విషయంలో కొత్త ఆశలకు తెరలేపుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. విద్యను వ్యాపారం చేయటానికి కూడా ఒక అంతు, హద్దు అనేది ఉండాలి. పిల్లలకు ఇచ్చే ట్యూషన్, ఫీజురీయంబర్స్ మెంట్ నిధులతో ఇన్నాళ్ళు కాలేజీలను నడిపించి. చివరికి ప్రభుత్వాన్నే ఆశించే స్థాయికి కాలేజీ యాజమాన్యాలు రావట అంటే పేద, మధ్యతరగతికి ఉన్నత విద్యను దూరం చేసినట్లేనని భావించాల్సి వస్తుంది. ఈ విషయంపై ప్రజల్లో అసహనం పెరుగకముందే ప్రభుత్వం కళ్లు తెరవటం సరస్వతిని గౌరవించినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: