Image result for mccain

ట్రంప్‌కొచ్చిన కష్టాలు ఇప్పుడు "వాటర్‌గేట్‌ పరిమాణానికీ, దాని స్థాయికీ చేరాయని" ట్రంప్ స్వంత పార్టీ (రిపబ్లికన్‌ పార్టీ) సెనెటర్‌ "జాన్‌-మెకెయిన్‌" అన్నారంటే ఆయన ఎంతటి సంక్లిష్ఠ  పరిస్థితుల్లో ఇరుక్కు పోయారో అర్ధమవుతుంది. కొద్దికాలం లోనే అయ్యవారికి ఉద్వాసన తప్ప దంటున్నారు అమెరికన్లు. దానికి క్రింద ఉదహరించిన కారణాలే పునాదులు.

Image result for trump putin

*అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యాతో ట్రంప్‌ బృందం కుమ్మక్కు కావటం

*ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జాతీయ భద్రతా సలహాదారుగా మైకేల్‌ ఫ్లిన్‌ కేవలం 23 రోజులే పనిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దొడ్డి దోవన కాపాడటానికి ప్రయత్నించి ట్రంప్‌ దొరికి పోయారు.

*మైకేల్‌ ఫ్లిన్‌ రష్యా రాయబారితో పరిధికి మించి మాట్లాడిన మాటలు వెల్లడి కావడం, అధికారం లోకొచ్చాక మీపై ఉన్న ఆంక్షలు ఎత్తేస్తామని అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ రాయబారితో ఫ్లిన్‌ అన్నారని మీడియా ద్వారా తెలియటం తో ఆయన తప్పుకోవాల్సివచ్చింది.

*అయితే ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ ని ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రయత్నించి, దానికి కోమీ నిరాకరించడంతో ఆయన్ను పదవి నుండి అ ప్రజాస్వామిక పద్దతి లో తొలగించారు.

*అమెరికా న్యాయ విభాగం "రష్యాతో ట్రంప్‌ బృందం సంబంధాల" పై దర్యాప్తునకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మూలర్‌ ను ప్రత్యేక అటార్నీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  మైకేల్‌ ఫ్లిన్‌ విషయంలో జమెస్ కోమీ ని ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రయత్నించినట్టు రుజువైన పక్షంలో ఆయన అభిశంసనకు గురైపదవి కోల్పోవడం మాత్రమే కాదు, ఉభయ బ్రష్టట్వంగా 20 ఏళ్ల సుదీర్ఘ కాలం జైలులో ఉండాల్సివస్తుంది.

*సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ రహస్య స్థావరంపై ఒబామా ప్రభుత్వం జరపబోయిన దాడి విషయంలో టర్కీ ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా మైకేల్‌ ఫ్లిన్‌ నడుచుకున్నారని, అందుకు భారీ మొత్తం లో ఆయన నేతృత్వంలోని సంస్థకు ముడుపులు అందుకున్నారని ఆరోపణలొచ్చాయి అయినా తన ప్రచార బృందంలో మైకేల్‌ ఫ్లిన్‌ ను ట్రంప్ కొనసాగించారు.

*ఎన్నికల ప్రచార సమయం లో ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్ విజయావకాశాలను దెబ్బతీసేందుకు రష్యా అమలు చేసిన రహస్య వ్యవహారాలన్నింటిలోనూ ట్రంప్ అదృశ్య హస్తము ఉన్నదని ఆరోపణలొస్తున్నా ట్రంప్‌ పట్టించుకోలేదు.

*ట్రంప్ వైట్‌హౌస్‌ సిబ్బందిని సమావేశపరిచి అందరూ ఒకే మాట పై ఉండాలని సూచించిన 24 గంటలు గడవక ముందే "ట్రంప్‌కూ - రష్యా అధ్యక్షుడు పుతిన్‌" కూ మధ్య జరిగిన సంభాషణ మొత్తం మీడియా ద్వారా లీకై "తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌ అమెరికాకు అందజేసిన ఒక రహస్య సమాచారం" ట్రంప్‌ పుతిన్ కు వెల్లడించారన్న పెద్ద అభియోగానికి సాక్ష్యాలతో బయట పెట్టింది.

*ట్రంప్పై అతిపెద్ద మరో అభియొగం "హెచ్‌ 1బి వీసాలపై ఆంక్షలతో సహా వలసలను అరికట్టడానికి ట్రంప్‌ సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటే - ట్రంప్‌ అల్లుడు కుష్నర్‌ మాత్రం తమ వ్యాపారంలో 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే ఈబీ 5 వీసాను అందజేస్తామని చైనా సంపన్నులకు ట్రంప్ ఆశచూపాడు"

*ట్రంప్ కుమార్తె ఇవాంకా సైతం అధికార కార్యకలాపాల్లో విపరీత జోక్యం చేసుకుంటున్నట్టు అనేక వార్తలొస్తున్నాయి ఇదీ కూడా ట్రంప్ పదవికి ఎసరు పెట్టేఅ ప్రమాద హేతువే.


"లేని సంక్షోభాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని ట్రంప్‌ రెచ్చగొట్టే ప్రసంగాలకు" సులభంగా లొంగి పోయి భయం, అపనమ్మకం, జాత్యహంకారం, ఆధిపత్య ధోరణులతో టృఅంప్ కు ఓట్లేసిన జనం ఇప్పుడు జరుగుతున్న కంపు పరిణామాల పట్ల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం.

Image result for trump putin

అయితే ఈ మద్య  ప్రైవేటు సంస్థ "పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ (పీపీపీ) గత మంగళవారం (16.05.2017) నాడు జరిపిన సర్వే ప్రకారం ఏకంగా 48% అమెరికన్లు ట్రంప్‌ను రికాల్ చేసి అభిశంసించాలని ప్రజా భిప్రాయం. దీనికి వ్యతిరేకంగా, త్రంప్ కు అనుకూలంగా 41% మంది మాత్రమే ఓటు చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం పనితీరు బాగుందన్న వారు 40%, కాగా పాలనపై పెదవి విరిచిన వారు ఏకంగా 54%  ఉండటం గమనార్హం.


ఈ విధంగా తన నెత్తిన తానే హస్తముంచుకున్న భస్మాసురుని తరహాలో ట్రంప్ ఊబిలోకి జారి పోతున్నాడు. అతివేగంగా అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేఖంగా తమ అభిప్రాయం మార్చు కోవటం ఇక్కడ గమనార్హం. ఈ సర్వె ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌-కోమీని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాక అంటే ఈ నెల 12 నుంచి 14 మధ్య జరిగింది. కాబట్టి కొద్ది కాలం లోనే అయ్యవారికి ఉద్వాసన తప్ప దంటున్నారు అమెరికన్లు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: