బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన గులాబీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తోంది. అనితర సాధ్యుడుగా పేరున్న అమిత్ షా తెలంగాణలో ఏం మాయ చేస్తాడో అన్న ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు పాలన నల్లేరుపై నడకలా సాగిపోతోంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో బలపడాలని యోచిస్తోంది. 

AMIT SHAH NALGONDA TOUR కోసం చిత్ర ఫలితం


తాజాగా అమిత్ షా  నల్గొండ జిల్లా తెరేట్ పల్లి పర్యటనలో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించారు. నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందిన మైసయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఆ తర్వాత దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు.  అమిత్ షా పర్యటన కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. 



తెరేటుపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాల అమలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులు వేస్తున్న పంటలు, వారికి ప్రభుత్వం నుంచి నుంచి లభిస్తున్న మద్దతు ధరలు, మార్కెటింగ్ సదుపాయాలు గురించి ఆరా తీశారు.  ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో సరిగా అమలు కావడంలేదన్నారు.

AMIT SHAH NALGONDA TOUR కోసం చిత్ర ఫలితం


తెరేటుపల్లి గ్రామంలో కనీసం మంచి నీరు... మరుగుదొడ్లు కూడా లేవని అన్నారు. కేంద్ర దేశవ్యాప్తంగా 4 కోట్ల మరుగు దొడ్లు కట్టిస్తుంటే.. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలుకు నోచుకోవడం లేదని చెప్పారు. కష్టపడి పనిచేస్తే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పర్యటనకు మంచి స్పందన రావడంతో టీఆర్ఎస్ నేతల్లో కంగారు పెరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: