ఏ కూర చేసినా అందులో ఘాటు ఉండాలంటే మిర్చి పడాల్సిందే. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు మిర్చికి మంచి పేరుంది. అత్యంత ఘాటైన రకం అని చెప్పుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి ఎక్కడ ఉందో తెలుసా.. అది ఒక్కసారి నోట్లో వేసుకుంటే ఏమవుతుందో తెలుసా.. అసలు మిర్చి ఘాటును కూడా కొలుస్తారు ఆ సంగతి తెలుసా.. 

CAROLINA DRAGON’S BREATH కోసం చిత్ర ఫలితం

ఆ విషయాలు ఇప్పుడుతెలుసుకుందాం.. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ రకాన్ని బిటిష్  శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి డ్రాగన్  బ్రెత్ గా నామకరణం చేశారు. బ్రిటన్ లోని వేల్స్ కు చెందిన మైక్ స్మిత్  అనే ఓ రైతు.. నాటింగ్ హాం ట్రెంట్  విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో ఈ మిరపను పండించారు. 

CAROLINA DRAGON’S BREATH కోసం చిత్ర ఫలితం

మిరపఘాటును స్కావిల్లే హీట్  స్కేల్ అనే స్కేలు మీద కొలుస్తారు. దాని  మీద ఈ డ్రాగన్ బ్రెత్ ఘాటు 20 లక్షల 48 వేలుగా నమోదైందట. ఈ మిరపకాయను ఒక్కసారి  నాలుక అంచున పెట్టుకుంటే చాలు.. 10 సెకన్లకే నోరంతా మండిపోతుందట. ఇక రెండు రోజుల వరకూ ఆ నాలుక మొద్దుబారిపోతుందట. ఈ విషయాలన్నీ వివరించిన రైతు స్మిత్.. దీన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే ప్రయత్నాలూ చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: