ఇటీవలి కాలంలో వాన్నా క్రై వైరస్ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లను వణికించిన సంగతి తెలిసిందే. అనేక దేశాల్లో ఈ వైరస్ కారణంగా వైద్య సేవలు నిలిచిపోయి జనం నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు వంద దేశాల్లోఆ వైరస్ ప్రబావం స్పష్టంగా కనిపించింది. మన దేశంలోనూ ఈ వైరస్ ప్రవేశించి కొన్నివ్యవస్థలను నాశనం చేసింది. 

wanna cry VIRUS కోసం చిత్ర ఫలితం


కేంద్రం ఈ వాన్నా క్రై దెబ్బకు మూడు రోజులపాటు దేశంలోని అన్ని ఏటీఎంలను మూసేసింది. ఆ తర్వాత దాని ప్రభావం తగ్గింది. కానీ ఇప్పుడు ఇంకో మహమ్మారి వచ్చేస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడించిన రాన్ సమ్ వేర్  సైబర్ దాడి భయం నుంచి ఇంకా తేరుకోకముందే ఈ మహమ్మారి నిపుణుల కంటపడింది. దీని పేరు ఎటర్నల్  రాక్స్ కంప్యూటర్  వైరస్.

wanna cry VIRUS కోసం చిత్ర ఫలితం

ఇది కూడా వానాక్రై లాగానే విండోస్  సిస్టమ్స్ పైనే దాడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వానాక్రై విండోస్  సిస్టమ్స్ పై దాడి చేసేందుకు ఆయా కంప్యూటర్లలోని ఏయే కాన్ఫిగరేషన్స్  కారణమయ్యాయో, అలాంటి కాన్ఫిగరేషన్స్  ఉన్న కంప్యూటర్లనే ఎటర్నల్  రాక్స్  కూడా లక్ష్యంగా చేసుకుంటుందని వారు వివరిస్తున్నారు. 

wanna cry VIRUS కోసం చిత్ర ఫలితం


ఇంకో విషయం ఏంటంటే.. వానాక్రై కన్నా ఈ వైరస్  మరింత బలమైనదట.  దీనిని ఎదుర్కోవడం చాలా కష్టమట. వానాక్రై లాగానే ఎటర్నల్  రాక్స్  కూడా ఇతర 
కంప్యూటర్లకు వ్యాప్తి చెందడానికి ఎటర్నరల్  బ్లూ అనే NSA టూల్ నే ఉపయోగించుకుంటుందట. ఓ పక్క సర్కారు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తోంది. మరో పక్క ఇలాంటి వైరస్ ను దాడి చేస్తున్నాయి. మరి జనం ఏంకావాలో ఏంటో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: