అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ కు పెట్టుబడులు తీసుకొచ్చేలా పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కలిసి రావాలని అక్కడి తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో పట్టణంలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. 

IMG-20170522-WA0170.jpgని ప్రదర్శిస్తోంది

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు ఐటీ పరిశ్రమ ఎర్పాటుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేటీఆర్ అక్కడి తెలుగువారికి వివరించారు. ఇలాంటి ఈ ప్రయత్నానికి మద్ధతిచ్చేందుకు ప్రభుత్వం ఐటి టవర్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో రెండో తరగతి నగరాలకు ఐటీ విస్తరణలో ప్రవాస భారతీయులు చొరవ చూపాలని కోరారు.

IMG-20170522-WA0172.jpgని ప్రదర్శిస్తోంది


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను కేటీఆర్ వారికి వివరించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నామని, సంక్షేమం, అభివృద్దికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని వివరించిన కేటీఆర్.. రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ తదితర సంస్థలు మెచ్చుకున్నాయని గుర్తు చేశారు. 

IMG-20170522-WA0173.jpgని ప్రదర్శిస్తోంది


మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని కేటీఆర్ తెలిపారు. విద్యుత్తు, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామని.. ఇవన్నీ పూర్తైతే బంగారు తెలంగాణ సాద్యం ఖచ్చితంగా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు సహకరించిన ప్రవాసులు... రాష్ర్ట అభివృద్ధిలోనూ అదే స్పూర్తితో భాగస్వాములు కావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: