తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో రజినీకాంత్.    కేవలం తన చిత్రమైన నటనతో అందరి మనసు కట్టిపడేసిన రజినీకాంత్ డైలాగ్స్ అంటే తమిళ తంబీలు పడి చస్తారు.  ఒక రకంగా చెప్పాలంటే తమిళ ఇండస్ట్రీలో రజినీ సినిమా రిలీజ్ అవుతుందంటే వారం రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద భారీ ఎత్తున సందడి నెలకొంటుంది.  అలాంటి రజినీకాంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  

గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి నెల కొంది.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత తమిళనాడు సీఎం పీఠంపై శశికళ, పన్నీరు సెల్వం ల మద్య పెద్ద యుద్దం జరిగింది.  అనూహ్యంగా సీఎం పదవి మాత్రం పళని స్వామికి దక్కింది.  అయితే ఆర్ కే నగర్ లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.  ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు చక్కదిద్దాలంటే తమకిష్టమైన రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.  

ఈ మేరకు రీసెంట్ గా రజినీకాంత్ తన ఫ్యాన్స్ తో ఓ సమావేశం ఏర్పాటు చేసి దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని అన్నారు.  కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడేమో అన్న అనుమానంతో రజనీ తమిళుడు కాదని అలాంటి వ్యక్తి తమిళ రాజకీయాల్లోకి రావడానికి వీలు లేదంటూ పెద్ద ఎత్తున తమిలనాట ఆందోళనలు చేపట్టారు .
Image result for protests by pro-tamil group
కోయంబత్తూర్ లో అయితే ఏకంగా రజనీకాంత్ దిష్టి బొమ్మ ని దగ్దం చేసారు దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను చెల్లాచెదురు చేసారు . అలాగే చెన్నై పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుకోని పరిణాలకు పోలీసులు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా పెద్ద ఎత్తున తమిళ సంఘాలు నిరసన చేపట్టడంతో రజనీ ఇంటి వద్ద పోలీసుల పికెట్ ఏర్పాటు చేసారు . మహారాష్ట్ర వాడైన రజనీ తమిళుడు ఎలా అవుతాడు అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: