Line of Control

వాస్తవాధీన రేఖ వెంబడి నౌషెరా సెక్టార్‌లో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఒక్కసారిగా  భీకరదాడులతో, భారత సైన్యం పాకిస్తాన్‌ మీద మరోసారి “సర్జికల్ స్ట్రైక్స్” దాడులతో  విరుచుకుపడింది. ఈనెల 20, 21 తేదీలలో జరిపిన ఈ దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది.. చొరబాట్లకు పాకిస్తాన్  మద్దతు ఇస్తుండడంవల్లే దాడులు చేశామని చొర బాట్లను అడ్డుకున్నా మని చెప్పింది.


ఈ దాడులకు సంబంధించి ఆర్మీ వీడియోలనుకూడా  విడుదల చేసింది.  కొండ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ బంకర్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోల ను కూడా సైన్యం బయటపెట్టింది  భవిష్యత్‌లో భీకర దాడులు తప్ప వంటూ సైన్యం సంకేతాలు ఇచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది భారత సైన్యం. జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే తమకు ముఖ్యమని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ ప్రాంతం మొత్తం భారత సైన్యం ఆధీనంలోనే ఉందని, కౌంటర్ టెర్రరిజం తమ వ్యూహంలో భాగంగా నియంత్రణ రేఖను భారత సైన్యం పూర్తిగా డామినేట్ చేస్తోందని, ఉగ్రవాదులు చొర బాట్లకు పాల్పడే ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నామని, నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాలని, తద్వారా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిస్తే అక్కడి యువత మీద దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు.


ఈ శిబిరాల వల్లే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పారు. మే 9వ తేదీన, తర్వాత మళ్లీ 20,  21 తేదీలలో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, ఆటోమేటెడ్ గ్రనేడ్ లాంచర్లు, రికోయిలెస్ గన్‌లు ఉపయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.

Image result for indian army attacked LOC at naushara sector on 21 & 22nd May 2017

కొండల్లో ఉన్న మంచు కరుగుతూ భారతదేశం వైపు రావడానికి మార్గాలు తెరుచుకోవడంతో ఈ ప్రాంతంలో చొరబాట్లు పెరుగుతాయన్న ఆందోళనలు ఆ ప్రాంతవాసుల్లో ఉన్నాయని, అందుకే భారత సైన్యం ముందస్తు చర్యలు ముమ్మరంగా  తీసుకుందని ఆయన వివరించారు.

భారత సైన్యం  భీకర దాడులను పాకిస్థాన్‌ పౌరులు సానూకూలంగా స్పందించటమే కాదు భారత చాలా సైన్యం మంచిపని చేసిందంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. భారత్‌ అసలు తమ శిబిరాలపై  దాడులే నిర్వహించ లేదంటూ పాకిస్థాన్‌ ఆర్మీ కొట్టి పారేసిందంటూ “డాన్‌”  పత్రిక బానర్ వార్తను ప్రచురించగా,  దాని పై పాక్‌ పౌరులు కొందరు స్పందించారు. నియంత్రణ రేఖ వద్ద నుంచి చొరబాట్లు ఎక్కువై కశ్మీర్‌లో ఆందోళనలకు కారణం అవుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఈనెల 20, 21 తేదీలలో దాడలు జరిపింది ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ "చాలా గ్రేట్‌"  అంటూ కూడా కితాబిచ్చారు పాకిస్థాన్‌ వాసులు.


అయితే, భారత్‌ చేస్తుందంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ పాక్‌ అంతర్గత సేవల ప్రజా సంబంధాల డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ ఘఫూర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్‌ చెప్పింది. ఇదంతా కూడా అబద్ధం’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇక ఈ దాడుల ను భారత్‌లో పాకిస్థాన్‌ హైకమిషనర్‌గా అబ్దుల్‌ బాసిత్‌ కూడా తోసిపుచ్చారు. అలాంటి సమాచారం ఏది తమకు ఇంకా పాకిస్థాన్‌ నుంచి రాలేదని అన్నారు. ఇది తమకు తాము డబ్బా కొట్టుకోవటం కాదని కూడా చెప్పున్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే తాము గట్టిగా నొక్కి చెబుతున్నామని తెలిపారు. భారత్‌తో చర్చల కు పాక్‌ సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన ఈ విషయంలో అలా ఎందుకు చర్చించుకోకూడదని ప్రశ్నించారు.


ఉగ్రవాదం పాకిస్థాన్‌కు కూడా పెద్ద సమస్య అని, తీవ్ర ఆందోళన అని చెప్పిన అబ్దుల్‌ బాసిత్‌.. చర్చలు జరపటానికి  తామేం సిగ్గు పడటం లేదని అన్నారు. అన్ని సమస్య లకు మూల కారణం కశ్మీర్‌ సమస్యలోనే, దానితోనే ముడిపడి ఉందన్నారు.


భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి చేసిన దాడులను బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత రాజకీయంగా దూరమైన శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది. ఇక ఇప్పుడు ఆగేందుకు సమయంలేదని, లాహర్  వెళ్లి మరీ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఒక రకంగా పాకిస్తాన్‌ ను ఆక్రమించాల న్నట్లు గా - శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రశంసించారు.  


నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపించిన అసమాన ధైర్యసాహసాల కు సెల్యూట్ అని  కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా భారత  సైన్యం చర్యలను ప్రశంసలలో ముంచెత్తారు. 


PR275/17Indian claims of destroying Pakistani post along LOC in Naushera Sec and firing by Pak Army on civilians across LOC are false.

Image result for indian army attacked LOC at naushara sector on 21 & 22nd May 2017

భారత్‌ మరోసారి పాకిస్థాన్‌ శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహా దాడులను నిర్వహించడంపై అక్కడి పౌరులు సానూకూలంగా స్పందించారు. భారత ఆర్మీ చాలామంచిపని చేసిందంటూ ప్రశంసల్లోముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ చాలా గ్రేట్‌ అంటూ కూడా కితాబిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: