చలపతిరావును చంపాలి... చలపతిరావు నాలుక తెగ్గోయాలి... చలపతిరావును నడిబజార్లో నిలబెట్టి కాల్చిపడేయాలి...చలపతిరావును ఉరితీయాలి.. ఇది టుడేస్ కోట్ కదా...అద్సరే అలాగే చేద్దాం గానీ...మనలోపల ఉన్న చలపతిరావులనేం చేద్దాం, మన లోలోపలి చలపతిరావుల గుంపులనూ సమూహాలనూ ఏం చేద్దాం.వాళ్లనూ కాల్చిపడేసి నాలుక కోసేసి ఉరి తీసి చంపాలి కదా...

Image result for chalapathi rao comments

వాళ్లెవరు.... వాళ్లేం చేసారు పాపం అని అడక్కండి..." పూలదుకాణం మీదుగా పాలడిపోదాటి అట్టట్టా దిగివస్తే అకడె అకడె మా ఇల్లు" అన్నరెండర్దాలను ఒకే ఉద్దేశ్యంతో 
సూపర్ హిట్ చేసింది మన లోపలి చలపాయ్ కాదూ..ఓరోరి యోగి నను నలిపెయ్ రో..ఓరోరి యోగి నను చిదిమెయ్ రో.. ఓరోరి యోగి నను కుదిపెయ్ రో..అని
ఓ అమ్మాయి పాడుతుంటే తెగ మురిసిపోయి సూపర్ డూపర్ హిట్ చేసేసింది మనలోలోపలి చలపాయ్ కాదూ..

Image result for chalapathi rao comments

జబర్దస్త్ బూతు పురాణాన్ని మనలోపలి చలపాయ్ లు వినీ చూసీ యమ సొల్లు కార్చేసుకుంటుంటే ఇంకొంచెం డోసెక్కువ ఎక్స్ట్ ట్రా జబర్దస్తును మగాడోళ్ల అవకర బుల్లితెర 
కొక్కోకాలను మనముందుకు వచ్చేట్టు చేసి వాటికి సూపర్ డూపర్ బంపర్ హిట్ టీఆర్పీలు ఇచ్చింది మన లోలోపలి చలపాయ్ కాదూ.. జోతిలచ్చి గెంతులనూ జైమాలిని 
ఊపులనూ వాంప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్ లనూ సినీ సక్సెస్ ఫార్ములాలో తప్పనిసరి భాగం చేసేసింది మన లోపలి చలపాయ్ కాదూ.

Image result for chalapathi rao comments

కత్తి, మాల్ , స్టెమ్ము,ఫిగర్, కేసు,జబరి,జింజింనాకిడిబిళ్లా.. అని నామకరణ మహోత్సవాలు జరిపింది అదే చలపాయ్ లు కాదూ.. అతడిని తిట్టడానికి ఆమెను తిట్టడమే 
మార్గం కాని ఓ తిట్టేదైనా ఉందేమో చెప్పలేని గొప్పతనం మన ఇన్నర్ చలపాయ్ దే కాదూ. చలపతిరావునూ రవినీ అలీనీ ఆడిపోసుకోవడం ఎందుకు గానీ దాసరి కూడా 
హీరోయిన్ ను సరుకు అని ఇంతకంటే పెద్ద వేదిక మీదనుంచి అనలేదా...
మన లోపలి చలపతిరావుల మీద మన మనస్సాక్షి పోలీస్ స్టేషన్లో అంతరాత్మ ఎఫ్పైఆర్ నమోదు చేయాలి. ముసుగులు తీసేయాలి. మన చలపాయ్ లు రహస్యంగా క్షేమంగా ఉన్నంత కాలం చలపతిరావులు అడ్డమైన వేదికలమీదనుంచి వాగుతూనే ఉంటారు.. అందుకే అన్నింటికంటే ముందు.. కిల్ ఔటర్ ఇంపర్సినేషన్ ఫస్ట్!!!!
( ఫేస్ బుక్ లో కలకలం రేపుతున్న పోస్టు ) 



మరింత సమాచారం తెలుసుకోండి: