అమ్మాయిలెందుకు పనికొస్తారు.? అన్న ప్రశ్నకి, 'పక్కలో పడుకోడానికి..' అని సమాధానమిచ్చి వివాదాల్లోకెక్కారు సీనియర్‌ నటుడు చలపతిరావు. ''ఎంతైనా సినిమాల్లో ఎక్కువగా రేపిస్టు క్యారెక్టర్లు చేసేశారు కదా,!! బహుశా ఆ ప్రభావం ఆయన మీద చాలా ఎక్కువగా వున్నట్లుంది.. ఈ వయసులో ఇంత 'మదం' దుర్మార్గం..'' అంటూ మహిళా సంఘాలు గళం విప్పాయి.



కాంట్రావర్సీలపై డిస్కషన్స్ పెట్టడంలో ముందుండే టీవీ9 చలపతిరావును చర్చకు ఆహ్వానించింది. చర్చా కార్యక్రమానికి హాజరైన చలపతిరావు, తన వ్యాఖ్యలపై వివరణ 
ఇచ్చుకోవాలనుకున్నారు.. ఇచ్చే ప్రయత్నమూ చేశారు. అసలు 'పక్క' అన్న పదానికి అర్థం వేరే వుందని చెబుతూ, అందులో వివాదమేమీ లేదనీ బుకాయించేందుకు నానా తంటాలూ పడ్డారు. కానీ, కుదరలేదు. 



ఈ చర్చకార్యక్రమంలో టీవీ9 మహిళాయాంకర్ చలపతిరావు వాదనను గట్టిగా ఖండించింది. పలుసార్లు హెచ్చు స్వరంతో బదులిచ్చింది. ఆడాళ్లు అందుకే పనికొస్తారా అంటూ నిలదీసింది. దీనికి తోడు మహిళాసంఘాల నేతలూ లైవ్ లోకి వచ్చేశారు. దాంతో చలపతిరావుకు చుక్కలు కనిపించాయి.  చివరికి, చలపతిరావు మెట్టు దిగారు. 'నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయను. ' అంటూ లెంపలేసుకున్నంత పన్జేశారు. 



సినిమాల్లోనూ, స్కిట్స్‌లోనూ పాత్రల స్వభావం నేపథ్యంలో అదంతే.. అని సరిపెట్టుకోవచ్చుగాక. కానీ, లైవ్ ప్రసారాలు జరుగుతున్నప్పుడు, సభ్య సమాజం తమని 
చూస్తున్నప్పుడు.. ఇలా నోరు పారేసుకోవడమేంట.? దీనికి చలపతిరావు సమాధానం మరీ కామెడీగా వుంది. 'ఏదో జోవియల్‌గా అలా..' అని సెలవిచ్చారాయన. మొత్తానికి చలపతిరావు టీవీ ఛానళ్లకూ.. సోషల్ మీడియాకు కావలసినంత వినోదం ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: