ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై అనేక సీబీఐ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. వాటి కోసం ఆయన ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్తుంటారు. అయితే ఈ కేసులన్నీ ఎవరు పెట్టారో పరిశీలిస్తే.. అప్పట్లో కాంగ్రెస్ నేత శంకర్ రావు.. టీడీపీ నేత ఎర్రన్నాయుడు వంటి వారు సీబీఐకు ఫిర్యాదు చేస్తే.. వాటిపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసుల్లో ఇంకా జగన్ దోషి అని తేలలేదు. 



కానీ జగన్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే తరహా గేమ్ ఆడబోతోంది. నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ అతనిపై సీబీఐ విచారణ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా... మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణానికి సంబంధించి వీరు ఫిర్యాదు చేశారు. 



దాదాపు రూ. 1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంటూ ఫిర్యాదులో ఆరోపించారు. కురుపాం రాజ వంశస్థురాలు రాణీ కమలమ్మను ఇందులో బినామీగా చేర్చారని తెలిపారు. అనంతరం మీడియాతో వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తాము ఈ వివరాలను సేకరించామని చెప్పారు. 



అంతే కాదు.. ఈ విషయంలో న్యాయం జరగకపోతే హైకోర్టుకు కూడా వెళతామని చెప్పారు. అందువల్ల ఇకపై నారా లోకేశ్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా తనలాగానే లోకేశ్ నూ కోర్టుల చుట్టూ తిప్పేందుకు వైఎస్ జగన్ టీన్ ప్రయత్నిస్తూనే ఉంటుందన్న సంగతి మరచిపోకూడదు. మరి ఈ విషయంలో వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా..! వేచి చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: