తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగాయ ఆయన బారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి తెలంగాణకు లక్షకోట్ల నిధులు ఇచ్చామని వ్యాఖ్యానించారు.   దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ   బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  తెలంగాణలో నిలబడి బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోయిదప్పి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తాము పించన్లు ఇవ్వడం లేదని అమిత్ షా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని దుయ్యబట్టారు.
Image result for amit shah telangana
అమిత్ షా తెలంగాణను వీడిపోయేలోపు వాస్తవాలు ఆయన తెలుసుకునేలా మీడియా కథనాలు రాయాలని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను సీఎం వెల్లడించారు. సర్వీస్ ట్యాక్స్ రూపంలో దేశానికి రూ.7,671 కోట్లు వస్తుంది. కస్టమ్స్ ట్యాక్స్-రూ.3,328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్-రూ.6,828 కోట్లు వస్తుంది. మొత్తం తెలంగాణ నుంచి కేంద్రానికి ఇచ్చింది రూ.50,013 కోట్లు, మనకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ.24,561 కోట్లు.
Image result for amit shah telangana
మనం అదనంగా ఇచ్చింది రూ.25,452 కోట్లన్నారు. ఏటా 20 వేల కోట్లు దేనికోసం ఇస్తున్నారు.  దేశాన్ని పోషించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భారత దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలు ఆరు, ఏడు ఉంటయని, మిగతావన్నీ లోటు బడ్జెట్ రాష్ట్రాలేనన్నారు.  ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: