తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దళితుల ఇంట్లో భోజనం చేశారు. దళితులు ఇచ్చిన టీ తాగారు. అంతా బాగానే ఉంది. ఫోటోలకు ఇచ్చిన పోజులు పేపర్లలో బాగానే వచ్చాయి. అయితే.. తెరాట్‌పల్లి గ్రామంలో దళితులతో సహపంక్తి భోజనాలు చేసిన అమిత్‌ షా గుట్టును కేసీఆర్ భలేగా బయటపెట్టారు. ఆ భోజనం ఎక్కడినుంచి తెప్పించుకున్నారో తెలుసా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


            అమిత్ షాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్..!

వాస్తవానికి అమిత్ షా దళితుల ఇంట తిన్న ఆ భోజనాన్ని దళితుల ఇంట్లో వండించలేదని, అక్కడకు సమీపంలో ఉన్న కమ్మగూడెం అనే గ్రామంలో మనోహర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన మామిడి తోటలలో వండించారని కేసీఆర్ చెప్పారు. దీనిపై తెరాట్‌పల్లి దళితులు నిరసన కూడా వ్యక్తం చేశారన్నారు. తాను మాట్లాడేది తెరాట్‌పల్లి దళితులు కూడా చూస్తున్నారని, తాను తప్పు చెబితే వాళ్లు నన్ను అడగకుండా ఉంటారా అని ప్రశ్నించారు. 



            అమిత్ షాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్..!

తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. వాళ్లు మంచిగా టేబుళ్ల మీద తింటూ ఫొటోలు తీయించుకుంటే.. చింతా సాంబమూర్తి అనే దళిత నాయకుడు మాత్రం వాళ్ల వెనకాల చేతులు కట్టుకుని నిలబడ్డారని కేసీఆర్ తెలిపారు. పెద్దదేవిపల్లికి నల్లగొండ అన్నపూర్ణ హోటల్ నుంచి భోజనం వెళ్లిందని, తాజాగా బుధవారం మాత్రం ఒక దళిత నాయకుడి ఇంట్లో వండించుకుని తిన్నారని అన్నారు.

Image result for amit shah eat dalith house

దళితులతో భోజనం అంటే వాళ్ల ఇంట్లో వండిందే తినాలని, కానీ అమిత్ షా మాత్రం అలా కాకుండా బయటి నుంచి తెప్పించుకుని అక్కడ తిన్నారని చెప్పారు.  ఈ విషయం కేసీఆర్ ఈరోజు చెప్పినా.. ఇప్పటికే సోష్ మీడియాలో అమిత్ షా దళిత భోజనంపై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. ఆయన గుట్టును నెటిజన్లు ఉతికి ఆరేశారు. ఇప్పుడు ఏకంగా కేసీఆరే చెప్పడంతో అమిత్ షా పరువు గంగలో కలిసినట్టయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: