Image result for great lier kcr bjp leaders

దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణా తొలి ముఖ్యమంత్రి దళితుడేనని నొక్కి వక్కాణించిన కలవకుంట్ల చంద్రశేఖర రావు అదే పీఠంపై కూర్చోవటం మాటతప్పటం అబద్దమాడటం కాదా? పేదలకు మూడులక్షల రెండు పడకల ఇళ్ళు కట్టిస్తానన్న కేసిఆర్ మూడు సంవత్సరాల్లో 2వేల ఇళ్లు కూడా పూర్తిచేయనందుకు కూడా ఆయన తెలంగాణా ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పరన్నారు? 

Image result for great lier kcr bjp leaders

తెలంగాణకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని కేసిఆర్ అనటం కాదని, దళితుడి పీఠం లాక్కుని వారికి అధికారం ఇవ్వకుండా అందులో ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకు కేసీఆరే తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణా బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్లలో 2వేల ఇళ్లు కూడా పూర్తిచేయని కేసిఆర్ మూడులక్షల గృహాలను ఎప్పుడు నిర్మిస్థారు అసాధ్యాన్ని వాగ్ధానం చేసినందుకు కూడా తెలంగాణా ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. 

Image result for great lier kcr bjp leaders

కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తాము కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి చేసే తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేవాళ్లం కామని, కేంద్రంలో ఉన్నది మన్మోహన్ సింగ్‌ ప్రభుత్వం కాదు, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమ ని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో బీజేపీ ముందుందని చెబుతూ తెలంగాణా ఉద్యమంలో అతి ముఖ్యమైన సందర్బాలైన "సాగరహారంలో కేసిఆర్ నువ్వెక్కడ? రైల్‌రోకోలో కేసిఆర్ నువ్వెక్కడ? మిలియన్ మార్చ్‌లో కేసీఆర్ నువ్వె క్కడ?  అని ప్రశ్నించారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని ఉద్యమ కాలంలో అనేక మార్లు ప్రవచించిన నీరు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయలేని పక్షంలో  "తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్"  ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడగానే ఆ దళితుని సీట్లోతానే కూర్చోవటం ఏమి న్యాయమని అది అబద్దాలాడటం కాదా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. 


తెలంగాణాలో దళితులను తొలినుండీ అవమానించింది,  దళిత వర్గాలను ధారుణంగా మోసం చేసింది కేసిఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి తెలంగాణాలో ఒక్క సీటు కూడా గెలవలేరని అన్నదానికి సమాదానంగా - అసోం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాము గెలిచామని, అలాంటిది హైదరాబాద్‌ లోను, తెలంగాణ లోను ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. 


హిందూ ముస్లింల సమైక్యతతోనే తాము హైదరాబాద్‌ లో గెలుస్తా మని ఆయన స్పష్టం చేశారు. 2019 లో అధికారాన్ని సాధించు కునేందుకు కార్యర్తలంతా ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

Image result for kcr family members in politics

మరింత సమాచారం తెలుసుకోండి: