Image result for ipec project & new silk road


చైనా కు తొలి నుంచి అగ్ర రాజ్యం కావాలమే కోరిక. అంతే కాదు పైకి కమ్యూనిస్ట్ అనిచెప్పుకుంటున్నా పక్కా కాపిటలిస్టిక్ పంధాలో ప్రయాణం చేయటం, సామ్రజ్యవాదం దాని నైజం. ప్రక్క నున్న దేశాలు బలపడటం దానికిష్టం ఉండదు. టిబెట్ ను మింగేసిన దేశమది. ఒక జాతికి చోటు లేకుండా చేసిన నిరంకుశ సామ్రాజ్యవాది. అనేక దేశా లకు సహాయం చేసే నెపం తో తన అధికారం ప్రదర్శించే దురహంకారి. దక్షిణ చైనా సముద్రంపై తన పెత్తనం ప్రదర్శించటానికి అనుక్షణం  తహతహ లాడుటుంది. అలాంటి దేశం ప్రపంచదేశాలకు ప్రయోజనకరంగా సిల్క్ రోడ్ నిర్మిస్తానని చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ (సిపిఈసి)నిర్మించి ప్రపంచ దేశాలకు మౌలిక వసతులు, పవర్ జెనరేషన్ లాంటి వ్యవస్థలు నిర్మిస్తున్సంటే నమ్మెదెలా!

Image result for ipec project & new silk road

పాకిస్థాన్ ను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదుల్ని రక్షించేదేశమది. ప్రజాస్వామ్య భారత్ కు అనుక్షణం న్యూక్లియార్ సప్లై గ్రూప్ లో సభ్యత్వం రాకుండా అడ్డుపడే నమ్మతగని పొరుగు చైనా. భారత్ సరిహద్దుల్లో శాంతి లేకుండా చేసే ఈ దేశం ఎవరికీ మేలుచేయదని మనం విశ్వసించవచ్చు. అందుకే అమెరికాతో కలసి "చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ (సిపిఈసి)" కి ధీటైన ప్రత్యామ్నాయం సృష్టించటం చాలా అవసరం.  

Image result for ipec project & new silk road map

దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (ఓబీఓఆర్‌) కు గట్టి పోటీ నిచ్చేందుకు అమెరికా “న్యూ సిల్క్‌ రోడ్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌), ఇండో-పసిఫిక్‌ కారిడార్‌ (ఐపీఈసీ)”  ప్రాజెక్టులను పునరుద్ధరించనుంది. అయితే, దీని వల్ల భారత్‌కు ఏంటి ప్రయోజనం?  చైనాకు ఆగ్నేయ ఆసియాలో ప్రధానమైన పోటీదారుగా నిలవాల్సిన ఇతరులకు ఇబ్బందికలగించని భారత్ కు ప్రయోజనాలు ఈప్రోజెక్ట్ పరిధిలోకి  వచ్చే ఇతరదేశాలకు బహుళార్ధ సాధక ప్రయోజనాలు ఏమిటన్నది ముఖ్యంగా చర్చించాలి. 


2011 లో భారత్‌లో పర్యటించిన అప్పటి యునైటెడ్ స్టేట్స్  ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’  హిల్లరీ క్లింటన్‌ -ఎన్‌ఎస్‌ఆర్‌, ఐపీఈసీ- లపై చెన్నై లో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల కేంద్రంగా ఈ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

Image result for indo pacific economic corridor

ఈ రెండు ప్రాజెక్టుల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు వైపు అడుగులు పడలేదు. “వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టు” లతో ప్రపంచంలోని ముఖ్య ప్రాంతాల్లో ముఖ్యంగా చైనా లాంటి దురాక్రమణదారు సారధ్యం ఆధిపత్యం లో ఎకనమిక్‌ కారిడార్‌లు తలపెట్టడం అగ్ర రాజ్యానికి అంత రుచించినట్లు లేదు. అందుకే బడ్జెట్‌ ప్రస్తావనలో సిల్క్‌ ప్రాజెక్టుల అంశాన్ని అమెరికా మంగళవారం చర్చించింది. అంతేకాదు త్వరలో ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రానున్న ఈ ప్రాజెక్టుల్లో భారత్‌ కీలకపాత్ర పోషించనుంది. ఈ మేరకు “అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌”  ప్రకటన విడుదల చేసింది.

“న్యూ సిల్క్‌ రోడ్‌(ఎన్‌ఎస్‌ఆర్‌)”  ఆప్ఘనిస్తాన్‌ దాని పొరుగు దేశాల గుండా పోతుందని, “ఇండో-పసిఫిక్‌ కారిడార్‌(ఐపీఈసీ)” దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలను కలుపుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆయా దేశాలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలతో త్వరలో చర్చిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లో మార్పుకు కృషి చేస్తున్న అమెరికా, న్యూ సిల్క్‌ రోడ్‌ ద్వారా మరింత మార్పును తెస్తుందని వివరించింది.


Image result for indo pacific economic corridor US India Japan

Trilateral India-Japan-USA Dialogue’ - The Indo-Pacific, 17 February 2017

అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం మధ్య ఆసియా దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందని “ఫారిన్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌” ప్రతినిధి జేమ్స్‌ మెక్‌బ్రైడ్‌ అన్నారు. చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు వివాదాస్పద ప్రాంతమైన - భారత్ భూభాగమై ఉండీ, పాక్ దురాక్రమణలో  ఉన్న “పాక్ ఆక్రమిత కాశ్మీర్”  - “గిల్గిత్‌ బాల్టిస్తాన్‌” గుండా పోతుండటంతో భారత్‌ “ఓబీఓఆర్‌” ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో చైనా ప్రాజెక్టుకు ధీటుగా ప్రారంభించనున్న “ఎన్ఎస్‌ఆర్‌,  ఐపీఈసీ” లకు భారత్‌ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ల్లో భారత్‌ కీలక భాగస్వామి కావడం వల్ల “టర్క్‌మన్‌ గ్యాస్‌ ఫీల్డ్స్‌”  నుంచి భారత్‌కు అవసరమవుతున్న ఇంధనాలను సులభంగా తెచ్చుకునే వీలు కలుగుతుంది. తాజిక్‌ కాటన్‌ భారత్‌కు అందుబాటులోకి వస్తుంది. ముంబై మార్కెట్‌ పెద్ద ఎత్తున విస్తృతమయ్యే అవకాశం కలుగుతుంది.

Image result for ipec project & new silk road map

మరింత సమాచారం తెలుసుకోండి: